అరటి కాయ ఉప్మాకూర | Raw banana curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Raw banana curry recipe in Telugu,అరటి కాయ ఉప్మాకూర, Sree Vaishnavi
అరటి కాయ ఉప్మాకూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

అరటి కాయ ఉప్మాకూర వంటకం

అరటి కాయ ఉప్మాకూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana curry Recipe in Telugu )

 • అరటి కాయలు 2
 • పచ్చిమిర్చి 4
 • అల్లం ముక్కలు 2 చెంచాలు
 • ఉల్లిపాయముక్కలు 1 కప్పు
 • తగినంత ఉప్పు
 • ఎండుమిర్చి 2
 • శనగపప్పు 1 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • కరివేపాకు 1 రెమ్మ
 • ఇంగువ 1 చిటికెడు
 • నూనె 3 చెంచాలు
 • పసుపు 1/2 చెంచా

అరటి కాయ ఉప్మాకూర | How to make Raw banana curry Recipe in Telugu

 1. ముందుగా అరటి కాయలను ఉడికించుకోవాలి .
 2. తరువాత తొక్క వొలిచి ముక్కలుగా తరుగుకుని ఒకపక్క ఉంచుకోవాలి .
 3. రోటిలో పచ్చిమిర్చి + అల్లం + ఉప్పు + పసుపు వేసుకొని నూరుకోవాలి .
 4. ఇప్పుడు స్టవ్ మీద బాండీ ఉంచుకొని నూనెవేసుకోవాలి .
 5. నూనె వేడి అయ్యాకా శనగపప్పు +మినపప్పు +ఆవాలు+ ఎండుమిర్చి+ ఇంగువ+ కరివేపాకు వరుసగా వేసుకొని వేయించుకోవాలి .
 6. వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసివేయించుకొవాలి .
 7. వేగాక అందులో నూరుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి వేయించాలి .
 8. ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని బాగాకలిపాలి .
 9. 2 నిముషములు వేగాక స్టవ్ ఆపివేసి కూరని గిన్నెలోకి తీసుకుంటే తినటానికి అరటికాయ ఉప్మాకూర రెడీ .

నా చిట్కా:

కూరలో నిమ్మరసం పిండుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

Reviews for Raw banana curry Recipe in Telugu (0)