చామదుంప వేపుడు | Colacassia fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Colacassia fry recipe in Telugu,చామదుంప వేపుడు, Sree Vaishnavi
చామదుంప వేపుడుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

4

0

చామదుంప వేపుడు వంటకం

చామదుంప వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Colacassia fry Recipe in Telugu )

 • చామ దుంపలు - పావు కేజీ
 • బియ్యప్పిండి - పెద్ద చెంచా
 • కారం - చెంచా
 • పసుపు - పావుచెంచా
 • ఆమ్‌చూర్‌ పొడి - అర చెంచా
 • ఉప్పు - తగినంత
 • నూనె - వేయించేందుకు సరిపడా
 • మినప్పప్పు - చెంచా
 • ఆవాలు - అర చెంచా
 • ఎండుమిర్చి - రెండు
 • కరివేపాకు - రెబ్బ
 • వెల్లుల్లి రెబ్బలు - ఐదు
 • కూరకారం - చెంచా

చామదుంప వేపుడు | How to make Colacassia fry Recipe in Telugu

 1. శుభ్రంగా కడిగిన చామదుంపల్ని కుక్కర్‌లో వేసి ఒక కూత వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి.
 2. తరవాత చెక్కు తీసి కోయాలి.
 3. వీటిపై బియ్యప్పిండి, కారం, పసుపు, ఆమ్‌చూర్‌ పొడి, ఉప్పు, నూనె వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. కావాలంటే బియ్యంపిండిని మరికొంచెం కూడా కలుపుకోవచ్చ
 4. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేసి ఈ ముక్కల్ని కరకరలాడేలా వేయించి తీసుకోవాలి.
 5. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మెత్తగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు వేయాలి.
 6. అవి చిటపటలాడాక మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి.
 7. దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న చామ దుంప ముక్కలు వేసి, పైన కూరకారం చల్లాలి.
 8. రెండు నిమిషాలయ్యాక దింపేయాలి

Reviews for Colacassia fry Recipe in Telugu (0)