పొన్నగంటికూర పప్పుకూర | Ponnagantikoora moongdal fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ponnagantikoora moongdal fry recipe in Telugu,పొన్నగంటికూర పప్పుకూర, Sree Vaishnavi
పొన్నగంటికూర పప్పుకూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

పొన్నగంటికూర పప్పుకూర వంటకం

పొన్నగంటికూర పప్పుకూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ponnagantikoora moongdal fry Recipe in Telugu )

 • పొన్నగంటి కూర 4 కట్టలు
 • పెసరపప్పు 1 కప్పు
 • పచ్చిమిర్చి 4
 • మినప్పప్పు 1 చెంచా
 • ఆవాలు 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • ఇంగువ 1/2 చెంచా
 • ఎండుమిర్చి 1
 • కారం 2 చెంచాలు
 • ఉప్పు 3 చెంచాలు

పొన్నగంటికూర పప్పుకూర | How to make Ponnagantikoora moongdal fry Recipe in Telugu

 1. ముందుగా పొన్నగంటి కూరని సన్నగా తరుక్కోవాలి
 2. దాన్ని కడిగి పెట్టుకోవాలి .
 3. కూరచేసుకునే 15 నిముషాలముందు పెసరపప్పు ను కడిగి నానపెట్టుకుని ఉంచుకోవాలి.
 4. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి .
 5. అందులో మినపప్పు + ఆవాలు + జీలకర్ర + ఎండుమిర్చి + ఇంగువ + పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి.
 6. తరిగి కడిగి ఉంచుకున్న పొన్నగంటికూర వేసుకొని
 7. బాగా కలిపి దానిమీద నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి
 8. దానిమీద పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి.
 9. కూరని 5 నిముషములు కదపకుండా చిన్న మంట మీద ఉంచుకోవాలి .
 10. తరువాత బాగా కలిపి తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి
 11. కూరని 5 నిముషములు చిన్న మంట మీద ఉంచుకోవాలి.
 12. అంతే పొన్నగంటికూర పప్పుకూర ని గిన్నిలో మార్చుకొని అన్నంతో వడ్ఢిమ్చుకుని తినటమే .

నా చిట్కా:

పచ్చిపులుసుతో తింటే చాలా బాగుంటుంది .

Reviews for Ponnagantikoora moongdal fry Recipe in Telugu (0)