పంజాబీ ఛోలే మసాలా | Punjabi chole masala Recipe in Telugu

ద్వారా Deepika Chauhan  |  23rd Apr 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Punjabi chole masala recipe in Telugu,పంజాబీ ఛోలే మసాలా, Deepika Chauhan
పంజాబీ ఛోలే మసాలాby Deepika Chauhan
 • తయారీకి సమయం

  9

  గంటలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

948

0

పంజాబీ ఛోలే మసాలా వంటకం

పంజాబీ ఛోలే మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Punjabi chole masala Recipe in Telugu )

 • ప్రషర్ కుక్కర్ కోసం:
 • 2 కప్పుల ఎండు సెనగలు
 • 2 కప్పుల నీళ్ళు
 • 2-3 ఎండు ఉసిరి
 • ఉప్పు రుచికి సరిపడా
 • మసాలా గ్రేవీ కోసం:
 • ఉల్లిపాయ - మధ్యస్థ పరిమాణం, సన్నగా తరిగింది
 • టమోటా-1 మధ్యస్థ పరిమాణం, సన్నగా తరిగింది
 • 2-3 వెల్ల్లుల్లి రెబ్బలు+ 1 చిన్న అల్లం= అల్లం వెల్లుల్లి ముద్ద
 • ఇంగువ- 1/4 చెంచా
 • ఎర్ర కారం పొడి - 1 చెంచా
 • ధనియా పొడి - 1/2 చెంచా
 • జీలకర్ర పొడి-1/2 చెంచా
 • పంజాబీ ఛోలె మసాలా - 2 చెంచాలు
 • పసుపు - 1/2 చెంచా
 • 2 నల్ల యాలకులు/ఇలాచి
 • 4 మిరియాలు/సబుట్ కాలీ మిర్చి
 • 1 లవంగం
 • 2 ఎండు మిరపకాయలు
 • 1/2 చెంచా గరం మసాలా
 • 1/2 చెంచా ఆమ్చూర్ మసాలా
 • అలంకరణ కొరకు:
 • తరిగిన కొత్తిమీర

పంజాబీ ఛోలే మసాలా | How to make Punjabi chole masala Recipe in Telugu

 1. రాత్రంతా సరిపడా నీటిలో సెనగలని నానబెట్టి వాటిని వడకట్టండి. (సరిపడా నీటిని వేయండి). సాంప్రదాయంగా ఎండపెట్టిన ఉసిరిని ముదురు రంగు కోసం కలపండి.
 2. ప్రషర్ కుక్కరులో, ఎండు ఉసిరితో పాటుగా సెనగలని వేయండి. ఉప్పుతో పాటుగా దీనిలో నీళ్ళు పోయండి. దీనిని 20 నిమిషాలు ప్రషర్ కుక్ చేయండి. (ఇది ఒకసారి ఉడికాక, దాని నుండి ఉసిరి ముక్కలని తీసేయండి.)
 3. ప్యానులో మధ్యస్థ మంట పై నూనెని వేయండి, దానిలో ఇంగువ, నల్ల యాలకులు, మిరియాలు, లవంగం, అల్లం-వెల్లుల్లి ముద్ద, ఎండు మిర్చి వేయండి మరియు బాగా కలపండి.
 4. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి దానిని కలపండి. తర్వాత తరిగిన టమోటా వేసి అది ఉడికేదాకా బాగా ఉడికించండి.
 5. పసుపు, ఎండు కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, పంజాబీ ఛోలె మసాలా మరియు ఉప్పు అందులో వేయండి. బాగా కలపండి.
 6. సెనగలు ఉడికించడానికి వాడిన నీటిని కలపండి మరియు కొంతసేపు ఉడికించండి.
 7. కొత్తిమీరతో అలంకరించండి మరియు ఈ పంజాబీ ఛోలె ని తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, నిమ్మకాయతో పాటుగా, కుల్చాలు, భటురాలు, పూరీలు, రోటీలతో వడ్డించండి.

Reviews for Punjabi chole masala Recipe in Telugu (0)