హోమ్ / వంటకాలు / పంజాబీ ఛోలే మసాలా

Photo of Punjabi chole masala by Deepika Chauhan at BetterButter
3912
198
4.8(0)
1

పంజాబీ ఛోలే మసాలా

Apr-23-2016
Deepika Chauhan
540 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంజాబీ ఛోలే మసాలా రెసిపీ గురించి

నేను ఒక రెసిపీ పుస్తకం నుండి దీనిని వండడానికి ప్రేరణ పొందాను అలాగే తార్లా దలాల్ రెసిపీ నుండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • పంజాబీ
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ప్రషర్ కుక్కర్ కోసం:
  2. 2 కప్పుల ఎండు సెనగలు
  3. 2 కప్పుల నీళ్ళు
  4. 2-3 ఎండు ఉసిరి
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. మసాలా గ్రేవీ కోసం:
  7. ఉల్లిపాయ - మధ్యస్థ పరిమాణం, సన్నగా తరిగింది
  8. టమోటా-1 మధ్యస్థ పరిమాణం, సన్నగా తరిగింది
  9. 2-3 వెల్ల్లుల్లి రెబ్బలు+ 1 చిన్న అల్లం= అల్లం వెల్లుల్లి ముద్ద
  10. ఇంగువ- 1/4 చెంచా
  11. ఎర్ర కారం పొడి - 1 చెంచా
  12. ధనియా పొడి - 1/2 చెంచా
  13. జీలకర్ర పొడి-1/2 చెంచా
  14. పంజాబీ ఛోలె మసాలా - 2 చెంచాలు
  15. పసుపు - 1/2 చెంచా
  16. 2 నల్ల యాలకులు/ఇలాచి
  17. 4 మిరియాలు/సబుట్ కాలీ మిర్చి
  18. 1 లవంగం
  19. 2 ఎండు మిరపకాయలు
  20. 1/2 చెంచా గరం మసాలా
  21. 1/2 చెంచా ఆమ్చూర్ మసాలా
  22. అలంకరణ కొరకు:
  23. తరిగిన కొత్తిమీర

సూచనలు

  1. రాత్రంతా సరిపడా నీటిలో సెనగలని నానబెట్టి వాటిని వడకట్టండి. (సరిపడా నీటిని వేయండి). సాంప్రదాయంగా ఎండపెట్టిన ఉసిరిని ముదురు రంగు కోసం కలపండి.
  2. ప్రషర్ కుక్కరులో, ఎండు ఉసిరితో పాటుగా సెనగలని వేయండి. ఉప్పుతో పాటుగా దీనిలో నీళ్ళు పోయండి. దీనిని 20 నిమిషాలు ప్రషర్ కుక్ చేయండి. (ఇది ఒకసారి ఉడికాక, దాని నుండి ఉసిరి ముక్కలని తీసేయండి.)
  3. ప్యానులో మధ్యస్థ మంట పై నూనెని వేయండి, దానిలో ఇంగువ, నల్ల యాలకులు, మిరియాలు, లవంగం, అల్లం-వెల్లుల్లి ముద్ద, ఎండు మిర్చి వేయండి మరియు బాగా కలపండి.
  4. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి దానిని కలపండి. తర్వాత తరిగిన టమోటా వేసి అది ఉడికేదాకా బాగా ఉడికించండి.
  5. పసుపు, ఎండు కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, పంజాబీ ఛోలె మసాలా మరియు ఉప్పు అందులో వేయండి. బాగా కలపండి.
  6. సెనగలు ఉడికించడానికి వాడిన నీటిని కలపండి మరియు కొంతసేపు ఉడికించండి.
  7. కొత్తిమీరతో అలంకరించండి మరియు ఈ పంజాబీ ఛోలె ని తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, నిమ్మకాయతో పాటుగా, కుల్చాలు, భటురాలు, పూరీలు, రోటీలతో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర