హోమ్ / వంటకాలు / సొరకాయ ఉల్లికారం కూర

Photo of Bottle gourd onion curry by Sree Sadhu at BetterButter
335
6
0.0(0)
0

సొరకాయ ఉల్లికారం కూర

Apr-29-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ ఉల్లికారం కూర రెసిపీ గురించి

సొరకాయ ఉల్లికారం కూర చేసుకోవడం ఎంతో సులువు. ఇది సొరాకాయ ముక్కల కమ్మ దనం, చింతపండు పులుపు తో పాటు ఉల్లి ఘాటుతో తినే కొద్ది తినాలనిపిస్తుంది.ఈ కూరని అన్నంతో గాని చపాతీ తో గాని తీసుకోవచ్చును.అన్ని విధాలుగా భలే రుచి గా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లిపాయలు : 3
  2. సొరకాయ : 1 మధ్యరకం
  3. ఎండు కారం : 2 చెంచాలు
  4. వెల్లులి రెబ్బలు : 4
  5. జీలకర్ర : 1 చెంచా
  6. ఉప్పు : రుచికి సరిపడ
  7. ధనియాలు : 1 చెంచా
  8. నూనె : 5 చెంచాలు
  9. చింతపండు పులుసు : 1/2 కప్పు
  10. ఆవాలు : 1 చెంచా

సూచనలు

  1. ముందుగా సొరకాయని పొట్టు తో పాటు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి.
  2. తరిగిన తరువాత అందులో ఉప్పు వేసి ఒక గుడ్డ లో కట్టి, నీరు ని పిండేయండి.
  3. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి నీరు పిండి పెట్టుకున్న సొరకాయ ముక్కలని వేసి వేయించుకోండి.
  4. అవి కొంచెం బంగారు రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి.
  5. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, వెల్లులి రెబ్బలు, కారం , ఉప్పు వేసి రుబ్బుకోని ముద్దాల చేసుకోండి.
  6. ఇప్పుడు మళ్ళీ ఒక బాణీ తీసుకొని అందులో రెండు చెంచాల నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి తాలింపు చేసుకోండి.
  7. రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేవరకు వేయించుకోండి.
  8. అందులో దోరగా వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి,చింతపండు పులుసు కూడా పోసి ఉడికించుకోండి.
  9. సరిపడినంత ఉప్పు కూడా వేసి మరో 5 నిముషాలు ఉడికించుకోండి.
  10. నూనె పైకి తేలిన తరువాత సొరకాయ ఉల్లికారం కూర వడ్డించు కోవతినికి సిద్ధం. ఈ కూరని అన్నం లో కి గాని చపాతీ లొ కి సర్వ్ చేసుకోవచ్చును.
  11. ఎంతో రుచికరంగా ఉండే ఈ సొరకాయ ఉల్లికారం మీరు కూడా చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర