హోమ్ / వంటకాలు / బటర్ చికెన్ మసాలా

Photo of Butter chicken masala by Kathi Mamatha at BetterButter
1015
2
0.0(0)
0

బటర్ చికెన్ మసాలా

May-01-2018
Kathi Mamatha
25 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బటర్ చికెన్ మసాలా రెసిపీ గురించి

నాకు తెలిసినంత వరకు చికెన్ ని ఇష్టపడని వారు ఉండరు . చికెన్ ని పలు విధాలుగా వండు కోవటం మనం చూసాం మరి హోటల్ లో చేసే విధంగా బటర్ చికెన్ ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ? సరే మరి ఆ రుచికరమైన హోటల్ లాంటి బటర్ చికెన్ రెసిపీ మీ అందరి కోసం.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • ఇతర
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ 500gm
  2. బటర్ 2 చెంచాలు
  3. నూనె 1 చెంచా
  4. ఉల్లిపాయలు 2 మధ్యరకం
  5. టమాటలు 2
  6. దాల్చిన చెక్క : అరా అంగుళం ముక్క
  7. కారం 1 1/2 చెంచాలు
  8. ధనియాల పొడి 1 చెంచా
  9. గరం మసాలా 1 చెంచా
  10. జీడిపప్పులు 5-6
  11. పాలు 1 కప్పు
  12. ఉప్పు రుచికి తగినంత
  13. లవంగాలు 2
  14. ఇలాయిచి 1
  15. మిరియాలు 4
  16. బిర్యాని ఆకు 1
  17. అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా

సూచనలు

  1. పెద్ద మూకుడు తీసుకొని వేడి చేసి అందులో ఒక చెంచాడు నూనె వేసుకోండి.
  2. నూనె వేడెక్కాక అందులో ఇలాయిచి , దాల్చిన చెక్క, లవంగాలు,బిర్యాని ఆకు మరియు మిరియాలు వేసి వేగనివ్వండి.
  3. గరం మసాలా దినుసులు వేగాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి ఆ పైన టమాటో ముక్కలు కూడా వేసి మగ్గా నివ్వండి , ఆ తరువాత జీడిపప్పులు వేసి వేయించుకొని స్టవ్ కట్టే యండి .
  4. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాస్య టమాటా ముష్రామాని చల్లారనివ్వండి ఆ పైన మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోండి .
  5. మరొక మూకుడు ని బటర్ వేసి వేడి చేసుకోండి ఆ తరువాత చికెన్ ముక్కలు వేసి కాస్త ఉడికించుకోండి .
  6. చికెన్ ముక్కలు కాస్త ఉడికిన తరువాత అందులో కరం పొడి, ఉప్పు వేసి మరి కాస్త సేపు ఉడికించుకొని రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని వేసి మంచిగా కలుపుకోండి .
  7. ఇప్పుడు ఇందులో పాలు మరియు నీళ్లు పోసి మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి.
  8. ఆఖరిగా ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే బటర్ చికెన్ రెసిపీ తయారు. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర