కాకరకాయ పూర్ణం | Stuffed bitter gaurd Recipe in Telugu

ద్వారా Kathi Mamatha  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stuffed bitter gaurd recipe in Telugu,కాకరకాయ పూర్ణం, Kathi Mamatha
కాకరకాయ పూర్ణంby Kathi Mamatha
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

కాకరకాయ పూర్ణం వంటకం

కాకరకాయ పూర్ణం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed bitter gaurd Recipe in Telugu )

 • కాకరకాయలు 250gm
 • ఉల్లిపాయలు పెద్దవి 3
 • ఆయిల్ 4-5tbsp
 • శనగపిండి 4tbsp
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1tbsp
 • ఇంగువ కొంచెం
 • చక్కర 1tsp
 • ఉప్పు రుచికి తగినంత
 • కారం 1tbsp
 • గరం మసాలా 1tspn
 • దనియాల పొడి 1tsp
 • జీలకర్ర పొడి 1/2tsp
 • పసుపు 1/4tspn

కాకరకాయ పూర్ణం | How to make Stuffed bitter gaurd Recipe in Telugu

 1. ముందుగా కాకరకాయలు కడగండి .... ఇప్పుడు వాటి పైన ఉన్న పొట్టును కొంచెం తీసివేయాలి... వాటిని నిలువునా ఒక పక్కనుండి కట్చేసి మద్యలోని గింజలు తీసి పక్కకు పెట్టుకోవాలి... ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి... అలానే కాకరకాయ గింజలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.. ఇప్పుడు ఒక నాన్స్టిక్ భాని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి... అది వేడి అయ్యాక అందులో ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి ... తరువాత అందులో ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేంచుకోవాలి... ఉల్లిపాయ ముక్కలు వేగుతునప్పుడే కొంచెం ఇంగువ మరియు ఉప్పు వేయాలి... ఆవి బాగా వేగాక అల్లంవెల్లులి పేస్ట్ వేసి వేంచి .... తరువాత శనగపిండి వేసి వేంచి ... ఇప్పుడు కారం మరియు పైన చెప్పిన పొడులు అన్ని వేసుకోవాలి....వాటితో పాటు కట్ చేసిన కాకరకాయ గింజల్ని కూడా వేసుకోవాలి... అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి... చివరిగా షుగర్ వేసుకోవాలి... ఇప్పుడు స్టవ్ కట్టేసి ఫ్రై చేసిన మిశ్రమము చల్లారబెట్టాలి ... కొంచెం చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని కాకరకాయ లో నింపుకోవాలి... వాటీని విడిపోకుండా దారం తో కట్టుకోవాలి... ఇప్పుడు అన్ని కాకరకాయలు నింపినతరువాత మళ్ళీ భాని లో ఆయిల్ వేసి కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి... మధ్య మధ్య వాటిని అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి.... అంతే కాకరకాయ పూర్ణం కూర రెడీ... ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సుమీ.... కాని కాకరకాయ తినని పిల్లలు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ అడుగుతారు....

నా చిట్కా:

ఇక్కడ నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను... మీకు అవి దొరకకపోతే పెదవి వట్టి తో కూడా చేసుకోవచు...

Reviews for Stuffed bitter gaurd Recipe in Telugu (0)