కూర పనస ఉల్లికారం | Bread fruit curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st May 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bread fruit curry recipe in Telugu,కూర పనస ఉల్లికారం, Sree Vaishnavi
కూర పనస ఉల్లికారంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  16

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

1

కూర పనస ఉల్లికారం వంటకం

కూర పనస ఉల్లికారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread fruit curry Recipe in Telugu )

 • కూర పనస 1
 • పెద్ద ఉల్లిపాయ 2
 • టమాటాలు 3
 • మిరపకాయలు 3
 • వెల్లులి 2 రెబ్బలు
 • లవంగం 3
 • అల్లం 1 అంగుళం
 • దాల్చినచెక్క 1 అంగుళం
 • బిరియాని ఆకు 1
 • కొబ్బరి ముద్దా 3 చెంచాలు
 • ఉప్పు తగినంత
 • కారం తగినంత
 • గరం మసాలా 1 చెంచా

కూర పనస ఉల్లికారం | How to make Bread fruit curry Recipe in Telugu

 1. ముందుగా కూర పనస ని తొక్కు తీయాలి
 2. వాటిని పెద్ద ముక్కలు గ తరుగుకోవాలి
 3. తరుగుకున్న వాటిని మెత్తగా ఉడికించుకోవాలి
 4. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె ఉల్లిపాయ వెల్లులి వేసి వేయించుకోవాలి
 5. అప్పుడు అందులో అల్లం టమాటా వేసి వేయించాలి మెత్తగా అయ్యే వరకు
 6. దానిని పక్కన పెట్టుకొని చలచుకోవాలి
 7. దానిని మిక్సీ లో ముద్దా ల చేసుకోవాలి
 8. ఒక బాణీ తీసుకొని అందులో నూనె జీరా లవంగాలు బిరియాని ఆకూ వేసి వేయించాలి
 9. అందులో కొబ్బరి పేస్ట్ వేసి నూనె తేలేవరకు వేయించాలి
 10. అప్పుడు అందులో ఉప్పు కారం గరం మసాలా వేసి మరో రెండునిమిషాలు వేయించాలి
 11. అందులో ఉల్లిపాయ టమాటో ముద్దా వేసి మరో నాలుగు నిముషాలు వేయించాలి
 12. ఇప్పుడు అందులో ఉడికిన బ్రెడ్ ఫ్రూట్ ముక్కలను వేసి ఉడికించుకోవాలి అంతే

నా చిట్కా:

బ్రెడ్ ఫ్రూట్ కోసేటపుడు కత్తి కి నూనె రాయాలి మరియు ఫ్రూట్ కూడా రాయాలి

Reviews for Bread fruit curry Recipe in Telugu (1)

Lakshmi Chintaa year ago

Super...
జవాబు వ్రాయండి
Sree Vaishnavi
a year ago
thank you very much