ట్రై వెజ్ కర్రీ | TrI(Y) Veg Curry Recipe in Telugu

ద్వారా Abhinetri V  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • TrI(Y) Veg Curry recipe in Telugu,ట్రై వెజ్ కర్రీ, Abhinetri V
ట్రై వెజ్ కర్రీby Abhinetri V
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

ట్రై వెజ్ కర్రీ వంటకం

ట్రై వెజ్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TrI(Y) Veg Curry Recipe in Telugu )

 • బంగాళదుంప ముక్కలు - 1 కప్పు
 • కంద ముక్కలు - 1 కప్పు
 • అరటికాయ ముక్కలు - 1 కప్పు
 • టొమాటో గుజు / ప్యూరీ- 1 కప్పు
 • ఆవాలు-1/4 టీస్పూన్
 • జీలకర్ర - 1/4 టీస్పూన్
 • ఉల్లిపాయ ముక్కలు ( తరిగిన ) - 1/2 కప్పు
 • అల్లం-వెల్లులి పేస్ట్/ముద్ద - 1 టీస్పూన్
 • పచ్చిమిర్చి ( పొడుగుగా కోసినవి ) - 2
 • నూనె - 3 టేబుల్ స్పూన్స్
 • ఉప్పు- రుచికి సరిపడ
 • కారం పొడి - 2 టేబుల్ స్పూన్స్
 • పసుపు- 1/4 టీస్పూన్
 • జీరా మరియు దానియా పొడి - 1 టీస్పూన్
 • నీరు - గ్రేవీ కి సరిపడ
 • కొత్తిమీర గార్నిషింగ్ కోసం

ట్రై వెజ్ కర్రీ | How to make TrI(Y) Veg Curry Recipe in Telugu

 1. ముందుగా ఓక బాణాన్ని లో నూనె పోసి, ఆవాలు ఇంకా జీలకర్ర వెయ్యండి. పోపు దినుసులు చిటపటలాడాకా అందులో తరిగిన ఉల్లి ముక్కలు, పొడుగ్గా కోసి పెట్టిన పచ్చిమిర్చి వేసి వేయించండి.
 2. ఉల్లి ముక్కలు వేగాక, ఇందులో బంగాళదుంప,అరటికాయ మరియు కంద ముక్కలని వెయ్యండి. రుచికి తగినంత ఉప్పు , చిటికెడు పసుపు కూడా వేసి శుభ్రంగా కలపండి. కాసేపు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి సన్నని సెగపైన వేగానీవండి.
 3. ముక్కలు కాస్త వేగాక , అందులో టమాటో గుజు/ ప్యూరీ , మరియు అల్లం-వెల్లులి ముద్దని వేసి అన్ని వైపులా బాగా కలపండి.
 4. ఈ మిశ్రమంలో జీరా మరియు దానియా పొడి, కరంపొడి , తగిన్నన్ని నీరు పోసి అన్ని వైపులా శుభ్రంగా కలపండి. ఒక 10 నిమిషాలు ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో ఉడకనిదాం.
 5. గ్రేవీ కాస్త దెగ్గరపడ్డాక అలాగే కూర లోని ముక్కలు సర్రిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి, తరిగిన కొత్తిమీర తురుము ని కూర పై వేసి సర్వ్ చెయ్యండి.
 6. ఈ ట్రై వెజ్ కర్రీ అన్నం తో లేదా రోటీ తో భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ? మీరు కూడా తయ్యార్ చెయ్యండి...

Reviews for TrI(Y) Veg Curry Recipe in Telugu (0)