హోమ్ / వంటకాలు / ట్రై వెజ్ కర్రీ

Photo of TrI(Y) Veg Curry by Abhinetri V at BetterButter
0
3
0(0)
0

ట్రై వెజ్ కర్రీ

May-01-2018
Abhinetri V
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ట్రై వెజ్ కర్రీ రెసిపీ గురించి

ట్రై వెజ్ కర్రీ అన్నం లో గానీ లేదా రోటీ తో రుచికరంగా ఉంటుంది. ఈ గ్రేవీ కూర ఇంట్లో సులభంగా తయ్యార్ చెయ్యడం ఎలాగో ఇప్పుడు మనం చూదాం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఆంధ్రప్రదేశ్
 • ఉడికించాలి
 • మితముగా వేయించుట
 • సైడ్ డిషెస్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. బంగాళదుంప ముక్కలు - 1 కప్పు
 2. కంద ముక్కలు - 1 కప్పు
 3. అరటికాయ ముక్కలు - 1 కప్పు
 4. టొమాటో గుజు / ప్యూరీ- 1 కప్పు
 5. ఆవాలు-1/4 టీస్పూన్
 6. జీలకర్ర - 1/4 టీస్పూన్
 7. ఉల్లిపాయ ముక్కలు ( తరిగిన ) - 1/2 కప్పు
 8. అల్లం-వెల్లులి పేస్ట్/ముద్ద - 1 టీస్పూన్
 9. పచ్చిమిర్చి ( పొడుగుగా కోసినవి ) - 2
 10. నూనె - 3 టేబుల్ స్పూన్స్
 11. ఉప్పు- రుచికి సరిపడ
 12. కారం పొడి - 2 టేబుల్ స్పూన్స్
 13. పసుపు- 1/4 టీస్పూన్
 14. జీరా మరియు దానియా పొడి - 1 టీస్పూన్
 15. నీరు - గ్రేవీ కి సరిపడ
 16. కొత్తిమీర గార్నిషింగ్ కోసం

సూచనలు

 1. ముందుగా ఓక బాణాన్ని లో నూనె పోసి, ఆవాలు ఇంకా జీలకర్ర వెయ్యండి. పోపు దినుసులు చిటపటలాడాకా అందులో తరిగిన ఉల్లి ముక్కలు, పొడుగ్గా కోసి పెట్టిన పచ్చిమిర్చి వేసి వేయించండి.
 2. ఉల్లి ముక్కలు వేగాక, ఇందులో బంగాళదుంప,అరటికాయ మరియు కంద ముక్కలని వెయ్యండి. రుచికి తగినంత ఉప్పు , చిటికెడు పసుపు కూడా వేసి శుభ్రంగా కలపండి. కాసేపు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి సన్నని సెగపైన వేగానీవండి.
 3. ముక్కలు కాస్త వేగాక , అందులో టమాటో గుజు/ ప్యూరీ , మరియు అల్లం-వెల్లులి ముద్దని వేసి అన్ని వైపులా బాగా కలపండి.
 4. ఈ మిశ్రమంలో జీరా మరియు దానియా పొడి, కరంపొడి , తగిన్నన్ని నీరు పోసి అన్ని వైపులా శుభ్రంగా కలపండి. ఒక 10 నిమిషాలు ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో ఉడకనిదాం.
 5. గ్రేవీ కాస్త దెగ్గరపడ్డాక అలాగే కూర లోని ముక్కలు సర్రిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి, తరిగిన కొత్తిమీర తురుము ని కూర పై వేసి సర్వ్ చెయ్యండి.
 6. ఈ ట్రై వెజ్ కర్రీ అన్నం తో లేదా రోటీ తో భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ? మీరు కూడా తయ్యార్ చెయ్యండి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర