అరటి దూట ఆవ పెట్టిన | Banana stem curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Banana stem curry recipe in Telugu,అరటి దూట ఆవ పెట్టిన, Sree Vaishnavi
అరటి దూట ఆవ పెట్టినby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

అరటి దూట ఆవ పెట్టిన వంటకం

అరటి దూట ఆవ పెట్టిన తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana stem curry Recipe in Telugu )

 • అరటి దూట : 250 గ్రాములు
 • పచ్చిమిర్చి : 3
 • కరివేపాకు : 1 రెమ్మ
 • పసుపు : 1/4 చెంచాడు
 • మజ్జిగ : 1 కప్పు
 • ఉప్పు : రుచికి సరిపడా
 • అల్లం ముక్కలు 1 చెంచా
 • శనగపప్పు 1 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • పల్లీలు 2 చెంచలు
 • ఆవ : 2 చెంచాలు
 • ఆవ : 2 చెంచాలు

అరటి దూట ఆవ పెట్టిన | How to make Banana stem curry Recipe in Telugu

 1. కూర మొదలు పెట్టె ముందు ఆవ సిద్ధం చేసుకోండి. అందు కొరకు ఆవాలు, నువ్వులు మరియు బియ్యాన్ని సమ పాలల్లో తీసుకొని సరి పడి నన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దను రుబ్బి పెట్టుకోండి.
 2. ముందుగా అరటిదూటనుశుభ్రం గా కడిగి తుడిచి , గుండ్రం గా తరగండి. ఆ తరువాత మధ్య లో వచ్చిన నారను తీసివేసి , సన్నగా మరియు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
 3. ఈ ముక్కలను మజ్జిగలో వేసి కొద్దిసేపు ఉంచాలి .
 4. అరటిదూట ముక్కలను ఒక బాణిలో వేసి సరి పడా నీళ్లు పోసి ఉడికించండి.
 5. దూత ముక్కలు ఉడికిన తరువాత చిల్లుల పళ్లెం లో పోసి చల్లార బెట్టుకొండి .
 6. పచ్చిమిర్చిని చీలికలుగా మరియు అల్లం ముక్కలు గా తరుగుకొండి .
 7. స్టవ్ వెలిగించి బాణి పెట్టి వేడెక్కాక సరిపడా నూనె వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి,  అవి దోరగా వేగిన తరువాత , కరివేపాకు , పచ్చిమిర్చి చీలికలు ,అల్లం ముక్కలు వేసి ఇవి కూడా దోరగా వేయించండి.
 8. ఉడికించి చల్లారబెట్టుకున్న అరటిదూట ,పసుపు , ఉప్పు వేసి బాగా కలపండి
 9. కొద్దిసేపు మగ్గనిచ్చి తడి పోయేంత వరకు ఉంచి స్టవ్ ఆపివేసి రుబ్బి పెట్టుకున్న ఆవముద్దవేసి బాగాకలుపుకొండి .
 10. అరటిదూట అవా పెట్టిన కూర రెడీ. ఒక గిన్నెలోకి తీసుకొని వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది.

నా చిట్కా:

అరటి దూట ముక్కలు మజ్జిగలో వేసుకుంటే నలుపు రంగు లోకి మారకుండా ఉంటాయి.

Reviews for Banana stem curry Recipe in Telugu (0)