చేపల కూర | Fish curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fish curry recipe in Telugu,చేపల కూర, Tejaswi Yalamanchi
చేపల కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

చేపల కూర వంటకం

చేపల కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fish curry Recipe in Telugu )

  • చాప ఒక 6 ముక్కలు
  • ఉప్పు 2 చెంచాలు
  • కారం 2 చెంచాలు
  • కొత్తిమీర తరిగినది 3 చెంచాలు
  • ఉల్లిపాయ 2 తరిగినది
  • పచ్చిమిర్చి 2 తరిగినది
  • చింతపండు ఒక నిమ్మకాయ అంతా
  • పచ్చికొబ్బరి 250 గ్రాములు
  • అల్లం 100 గ్రాముల ముక్క
  • వెల్లుల్లి 4 రెమ్మలు
  • దాల్చినచక్కా చిన్నవి 2
  • నూనె 6 చంచాలు
  • పసుపు 1/4 చెంచా
  • నీరు తగినంత లేదా 4 గ్లాసులు

చేపల కూర | How to make Fish curry Recipe in Telugu

  1. ముందుగా చింతపండు ని నీళ్ళలో నానబెట్టండి
  2. అది ననినక గుజ్జును తీసుకొని పక్కన ఉంచుకోండి
  3. పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి దాల్చినచెక్క మూడిటిని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోండి
  4. చేపను ముక్కలుగా చేసుకుని కడిగి పక్కన ఉంచుకోండి
  5. ఇప్పుడు చేప కూర చేసే గినేని తీసుకోండి
  6. దానిలో చేపముక్కలను వేసి నునే ఉప్పు పసుపు కారం వేసి చేపలకు బాగా పట్టించండి
  7. పది నిమిషాలు పక్కన ఉంచండి
  8. ఇప్పుడు ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టక దానిలో పైన తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి
  9. ఇప్పుడు దాంట్లో ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును వేసి తగినంత నీరు పోయండి
  10. ముందుగా చేసుకున్న పేస్టు మిశ్రమాన్ని దాంట్లో వెయ్యండి
  11. ఒకసారి చేతితో నెమ్మదిగా కలపండి
  12. ఇప్పుడు మొత్తం చేపల చట్టి న పోయి మీద పెట్టి ఒక 15 నిమిషాలు కడపకుండా ఉడికించుకోండి
  13. ఇప్పుడు ఒకసారి పులుపు ని ఉప్పుని చూసుకొండి కవలంటే వేసుకుంది
  14. చేప ముక్కలను గరిటతో తిప్పకూడదు నెమ్మదిగా చత్తిని అటూ ఇటూ కదుపుతూ ఉంటే మొక్కలు వాటంతట అవే తిరుగుతాయి
  15. గరిటతో కదిపితే చేపముక్కలు విరిగిపోతాయి
  16. ఒక్కసారి కదిపేక ఇంకో 10 నిమిషాలు ఉడికించండి
  17. చేప ముక్కలు మెత్తగా అయ్యాక కొత్తిమీర చల్లి దించేసుకోండి

Reviews for Fish curry Recipe in Telugu (0)