హోమ్ / వంటకాలు / కడలి మంజ తర్కారి( అరటి కొమ్మ కూర)

Photo of Kadali Manja Tarkari (Banana Stem Curry) by sweta biswal at BetterButter
6364
11
4.0(0)
0

కడలి మంజ తర్కారి( అరటి కొమ్మ కూర)

Apr-25-2016
sweta biswal
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఒరిస్సా
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. 8 అంగుళా పొడవు ఉన్న అరటి కొమ్మ
  2. 1 మధ్యస్త పరిమాణంలో ఉన్నబంగాలదుంప
  3. 1 మద్యస్త పరిమాణంలో ఉన్న ఉల్లిపాయ
  4. 1/౩ చెంచా పంచ ఫుటన
  5. ౩ ఎండు మిర్చి
  6. 1 చెంచా ధనియాలు
  7. 1/2 జీలకర్ర
  8. 1 అంగుళం దాల్చిన చెక్క
  9. 2 యాలకులు
  10. 2 బే ఆకులు
  11. 1 1/2 చెంచాలు అల్లం వెల్లులి పేస్టు
  12. ౩ -4 వెల్లులి రెబ్బలు
  13. 1/2 పసుపు
  14. 5 చెంచాల నునే
  15. రుచికి ఉప్పు

సూచనలు

  1. కడిగి అరటి కొమ్మని సన్నని చక్రాలుగా తరగాలి.
  2. ఒక సారి గుండ్రంగా కట్ చేస్తే, చుట్టూ విచుకునట్టు బయటకి వస్తుంది. దానిని మీ వేలితో గుండ్రంగా తిప్పుతూ దాని మీద ఉన్న్న ఫైబర్ ని తీసివెయ్యండి.
  3. ఆ గుండ్రటివాటిని చిన్న ముక్కలు లాగ తరగాలి. పసుపు మారియు ఉప్పు వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి.
  4. అరగంట తరువాత, రెండు చేతులతో ఆ ముక్కలను పిండితే నిరు బయటకు వస్తుంది.
  5. ఉల్లిపాయలను సన్నగా తరగాలి. బంగాళదుంప ను కూడా తరగాలి.
  6. వెల్లులి, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర మరియు ధనియాలు వేసి మెత్తని పేస్టు లాగా పట్టుకోవాలి వాటితో పాటే ఎండు మిర్చి కూడా వేసి పేస్టు పట్టాలి.
  7. ఒక ముకుడిలో 5 చెంచాల నునే వేసి వేడి చెయ్యాలి. అందులో పంచ ఫుటన, బె ఆకు మరియు ఒక ఎండు మిర్చి చెయ్యాలి. తరువాత ఉల్లిపాయలు కుడా వేసి బ్రౌన్ అయ్యే వేయించాలి.
  8. ఈ మసాల పేస్టు ని అల్లం వెల్లులి పేస్టు తో కలపాలి మరియు పసుపు వేసి పచ్చి వాసనా పోయేదాక వేయించాలి. అందులో బంగాళదుంప మూకలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.
  9. పిండేసిన అరటి కొమ్మ ముక్కలను వేసి ఉడికేదాకా ఉంచండి.
  10. కొమ్మ యొక లేతదనం మీద ఆధారపడి సమయం పడుతుంది. మరి లేతగా ఉంటె 8 -9 నిమిషాలలో ఉడుకుతుంది కాని అంత లేతగా లేకపోతే 15- 16 నిమషాలు పట్టవచ్చు.
  11. 1/2 కప్పు నీళ్ళు పోసి గట్టిగ మూత పెట్టాలి. ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
  12. మంట ఆర్పేసి. వేడి వేడి గా అన్నం తో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర