చిక్కుడుకయ బెల్లం పెట్టిన కూర | Broad beans jaggery curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th May 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Broad beans jaggery curry recipe in Telugu,చిక్కుడుకయ బెల్లం పెట్టిన కూర, Sree Vaishnavi
చిక్కుడుకయ బెల్లం పెట్టిన కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  16

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

1

చిక్కుడుకయ బెల్లం పెట్టిన కూర వంటకం

చిక్కుడుకయ బెల్లం పెట్టిన కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Broad beans jaggery curry Recipe in Telugu )

 • చిక్కుడుకాయలు 1/4 కేజీ
 • బెల్లం తురుము 1/4 కప్పు
 • కరివేపాకు ఒక రెమ్మ
 • బియ్యం పిండి 1 స్పూన్
 • సెనగపప్పు 1 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • ఎండు మిరపకాయలు 2
 • ఉప్పు రుచికి సరిపడ
 • పసుపు కొంచెం
 • నూనె 3 చెంచాలు

చిక్కుడుకయ బెల్లం పెట్టిన కూర | How to make Broad beans jaggery curry Recipe in Telugu

 1. ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసుకుని రెండు ముక్కలుగా చేసుకుని కుక్కరులో ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి
 2. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని సెనగ పప్పు + మినపప్పు + ఆవాలు + జీల కర్ర +ఎండు మిరపకాయలను వేసి వేగాక
 3. ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు పసుపు , సరిపడినంత ఉప్పు, బెల్లం , వరిపిండి , కరివేపాకులను వేసి బాగా కలిపి బెల్లం అంతా ముక్కలకు పట్టేంత వరకు మగ్గనివాలి
 4. నీరంతా పోయి కూర దగ్గర పడ్డాక స్టవ్ ఆపివెసుకొవాలి అంతే ఎంతొ రుచికరమైన చిక్కుడు కాయ బెల్లం కూర రెడీ
 5. చిక్కుడు గింజలు కొంచెం ఎక్కువగా ఉంటే చాల బాగుంటుంది

నా చిట్కా:

చిక్కుడు గింజలు కొంచెం ఎక్కువగా ఉంటే చాల బాగుంటుంది

Reviews for Broad beans jaggery curry Recipe in Telugu (1)

Revathi Kumaria year ago

traditional recipe...... super.
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo