కాకరకాయ మామిడికాయ కూర | Mango bittergourd subji. Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango bittergourd subji. recipe in Telugu,కాకరకాయ మామిడికాయ కూర, Sree Vaishnavi
కాకరకాయ మామిడికాయ కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  18

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

2

కాకరకాయ మామిడికాయ కూర వంటకం

కాకరకాయ మామిడికాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango bittergourd subji. Recipe in Telugu )

 • కాకరకాయ 4
 • మామిడికాయ తురుము 1/2 కప్
 • ఉప్పు తగినంత
 • కారం 2 చెంచాలు
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • గరం మసాలా 1/2 చెంచా
 • నూనె 4 చెంచాలు
 • నీళ్లు 2 కప్పులు
 • పసుపు చిటికెడు
 • ఎండుమిరపకాయలు 2

కాకరకాయ మామిడికాయ కూర | How to make Mango bittergourd subji. Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు పసుపు నీళ్లు వేసి అందులో కాకరకాయ ముక్కలు వేసి ఉడికించాలి
 2. అవి ఉడికిన తరువాత నీళ్లు వార్చుకొని పక్కన పెట్టుకోవాలి
 3. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె వేసి కాచుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించాలి
 4. అందులో ఉడికించిన కాకరకాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
 5. అది వేగిన తరువాత తురిమిన మామిడికాయ వేసి మరో రెండు నిముషాలు వేయించాలి
 6. అది మెత్తగా అయ్యాక అందులో ఉప్పు కారం వేసి మరో రెండు నిముషాలు వేయించాలి
 7. అందులో నూనె తేలేవరకు వేయించాలి
 8. తేలిన తరువాత గరం మసాలా వేసి మరో రెండు నిముషాలు వేయించాలి అంతే

Reviews for Mango bittergourd subji. Recipe in Telugu (2)

Vijaya Chintaa year ago

Nice Creativity....
జవాబు వ్రాయండి

Revathi Kumaria year ago

wooow
జవాబు వ్రాయండి