గోరుచుక్కుడు కూర | Cluster beans curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cluster beans curry recipe in Telugu,గోరుచుక్కుడు కూర, Sree Vaishnavi
గోరుచుక్కుడు కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

గోరుచుక్కుడు కూర వంటకం

గోరుచుక్కుడు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cluster beans curry Recipe in Telugu )

 • గోరుచుక్కుడు కాయలు 1/2 కిలో
 • ఉప్పు 3 చెంచాలు
 • శనగ పప్పు 1 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • ఇంగువ 1/4 చెంచా
 • ఎండుకొబ్బరి 1 చెంచా
 • ఎండుమిర్చి 1
 • నూనె 1 చెంచా

గోరుచుక్కుడు కూర | How to make Cluster beans curry Recipe in Telugu

 1. ముందుగా గోరుచుక్కుడుకాయలని పీచు తీసి చిన్నచిన్న ముక్కలుగా చిక్కుకోవాలి .
 2. తరువాత గోరుచుక్కుడుకాయ ముక్కలను కడిగి
 3. ఉప్పు , పసుపు వేసి కొంచెం నీరు పోసి కుక్కర్ లో 2 కూతలు వచ్చేవరకు ఉడికించుకోవాలి
 4. ఉడికిన ముక్కలు నుండి నీరు పూర్తిగా పిండివేసి ముక్కలు పక్కన ఉంచుకోవాలి
 5. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని నూనె వేడి చేసుకొని వరుసగా పోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి .
 6. ఇప్పుడు చల్లారిన గోరుచుక్కుడు ముక్కలు వేసి వేయించాలి
 7. వేగాకా రుచికి తగినట్లు ఉప్పు కారం వేసుకుని బాగాకలపాలి
 8. ఆఖరున ఎండుకొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆపివేసుకుంటే గోరుచుక్కుడు కూర రడీ

నా చిట్కా:

కురచేసుకోవాలి ముందురోజు ముక్కలు కోసుకుంటే కూర తొందరగా అవుతుంది

Reviews for Cluster beans curry Recipe in Telugu (0)