హోమ్ / వంటకాలు / క్యాప్సికం వేపుడు

Photo of Capsicum fry by Tejaswi Yalamanchi at BetterButter
734
2
0.0(0)
0

క్యాప్సికం వేపుడు

May-09-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికం వేపుడు రెసిపీ గురించి

దీనిలో క్యాప్సికం ముక్కలను వేయించుకొని, వేయించిన శెనిగ పిండి కలుపుకొని వేపుడు చేసుకుంటాం. సులువుగా తయారయ్యే రుచికరమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాప్సికమ్/ సిమ్లా మిర్చి 3
  2. వేయించిన శెనిగ పిండి 1/8 కప్పు
  3. జీలకర్ర 1/4 చెంచా
  4. వెల్లుల్లి రెబ్బలు 7
  5. వేయించిన ఎండు మిరపకాయలు ఆరు
  6. ఉప్పు 1 చెంచా
  7. ఆవాలు 1/4 చెంచా
  8. జీలకర్ర 1/4 చెంచా
  9. పచ్చి శనగపప్పు 1/4 చెంచా
  10. మినప్పప్పు 1/4 చెంచా
  11. నూనె 7 చంచాలు
  12. తరిగిన కొత్తిమీర 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా మూడు క్యాప్సికమ్లను తీసుకోండి
  2. క్యాప్సికంను కడిగి ముక్కలుగా తిరగండి
  3. ఒక మిక్సీ జార్లో వేయించిన శనగపప్పు, జీలకర్ర ,ఎండు మిరపకాయలు ,వెల్లుల్లి రెబ్బలు వేయండి
  4. పై వాటిని మెత్తగా మిక్సీలో పొడి చేసుకోవాలి
  5. పొయ్యి మీద ఒక బాండీ పెట్టి, వేడయ్యాక దాంట్లో నూనె పోసి కాగనివ్వాలి
  6. నూనె కాగాక దాంట్లో ఆవాలు , జీలకర్ర , మినప్పప్పు , శెనగపప్పు వేసి వేయించండి
  7. పైవి వేగాక క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కలిపి వేయించండి
  8. మూతపెట్టి క్యాప్సికమ్ ముక్కల్ని కాసేపు మగ్గనివ్వాలి అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వండి
  9. మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి
  10. క్యాప్సికం మెత్తబడ్డాక దాంట్లో తయారు చేసుకున్న పొడి వేసుకోండి
  11. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొండి
  12. మొత్తం కలిపి పొడి కాస్త ఎర్రగా అయ్యాదాకా వేయించుకోండి
  13. పొడి కాస్త ఎర్రగా అయ్యాక చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకుని దించేయాలి. కాప్సికం శెనెగె పిండి కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర