హోమ్ / వంటకాలు / వెజ్ నజాకట్

Photo of Veg nazakat by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

వెజ్ నజాకట్

May-09-2018
Sree Vaishnavi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ నజాకట్ రెసిపీ గురించి

వెజ్ నాజాకట్ మనం సాధారణంగా చేసుకునే కూరలకి కొంచెం భిన్నంగా ఉంటుంది అలాగే రుచి లో కూడా తిన్నవారు ఆహ ఏమి రుచి అని అనేక మానరు. ఈ కూర తందూరీ రోటీలు మరియు బట్టర్ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • చిన్న మంట పై ఉడికించటం
 • వేయించేవి
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. క్యారెట్ 1 కప్పు
 2. ఆలూ 1 కప్పు
 3. బీన్స్ 1/2 కప్పు
 4. లేత మొక్కజొన్న పొత్తులు 1/2 కప్పు
 5. పనీర్ 1/2 కప్పు
 6. కాప్సికం 1/2 కప్పు
 7. గోబీ పువ్వు 1/2 కప్పు
 8. బఠాణి 1/2 కప్పు
 9. జీడీపప్పు 5-6
 10. జీడిపప్పు పేస్ట్ 2 చెంచాలు
 11. కోవా 1/2 కప్పు
 12. కిస్మిస్ 9-10
 13. కలోంజీ /నల్ల నువ్వులు 1 చెంచా
 14. పచ్చిమిర్చి 4
 15. ఇలాచీ 2
 16. లవంగాలు 2
 17. అల్లం వెల్లులి పేస్ట్ 2 చెంచాలు
 18. పెరుగు 1/2 కప్
 19. వేయించిన ఉల్లిపాయ 1 కప్
 20. టమాటా 1
 21. ధనియాల పొడి 1 చెంచా
 22. కారం 1 చెంచా
 23. పసుపు 1/2 చెంచా
 24. క్రీం 3 చెంచాలు
 25. మిరియాలు 1 చెంచా
 26. నెయ్యి 2 చెంచాలు
 27. కొత్తిమీర 1/4 కప్
 28. ఉప్పు తగినంత

సూచనలు

 1. ముందుగా కూరగాయలని ముక్కలుగా సమానంగా తరుగుకోవాలి
 2. వాటిని నీళ్లు ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి
 3. ఇప్పుడు ఒక బాణీ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి
 4. అది వేడి అయ్యాక అందులో ఇలాచీ లవంగం,మిరియాలు వేసి రెండు సెకండ్ల పాటు వేయించాలి .
 5. అవి వేగిన తరువాత అల్లం వెల్లులి ముద్ద కూడా వేసి వేయించాలి
 6. అది వేగిన తరువాత జీడీపప్పు పేస్ట్ , కోవా, పెరుగు ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి.
 7. అది వేగిన తరువాత వేయించిన ఉల్లిపాయ నీళ్లు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి
 8. అది ఉడికిన తరువాత ధనియాల పొడి ఉప్పు, పసుపు , కారం , పర్చిమిర్చి వేసి ఇంకో 1/2 కప్ నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి
 9. అందులో కొత్తిమీర ఉడికిన కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి
 10. రెండు నిమిషాలు పోయాక క్రీం , కాజు , కిస్మిస్ వేసి ఒక నిమిషము ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే వెజ్ నజాకెట్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర