హోమ్ / వంటకాలు / గుత్తి దొండకాయ కూర

Photo of Masala ivy gourd curry by Sree Sadhu at BetterButter
523
4
0.0(0)
0

గుత్తి దొండకాయ కూర

May-13-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి దొండకాయ కూర రెసిపీ గురించి

గుత్తి వంకాయ మన అందరికి ట్రలిసిందే మరి అలాంటి కోవ కి చెందిన ఈ గుత్తి దొండకాయ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇది రోటి మరియు అన్నం లోకి కూడా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. దొండకాయ : 1/2 కేజీ
  2. నూనె : 5 చెంచాలు
  3. ఉల్లిపాయ : 2
  4. కొబ్బరి తురిమినది : 1/2 కప్పు
  5. పల్లీలు : 1/2 కప్పు
  6. నువ్వులు : 1/2 కప్పు
  7. ఎండుమిరపకాయలు : 4
  8. జీలకర్ర : 1 చెంచా
  9. కొత్తిమీర : 1/4 కప్పు
  10. జీడిపప్పు: 5-6
  11. బాదాం పప్పు : 3-6
  12. ధనియాలు : 3 చెంచాలు
  13. దాల్చినచెక్క : 1/2 అంగుళం ముక్క
  14. ఉప్పు : తగినంత
  15. ఎండు కారం : 2 చెంచాలు
  16. చింతపండు : నిమ్మకాయ అంత
  17. పంచదార : 1/4 చెంచా
  18. పసుపు : 1/4 చెంచా
  19. గరం మసాలా : 1 చెంచా

సూచనలు

  1. ముందుగా దొండకాయలను కడిగి గుత్తిలా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఉప్పు, పసుపు, వేసి కలిపి గుత్తి లా తరిగిన దొండకాయలు వేసి ఉడికించాలి.
  3. ఇప్పుడు ఒక బాణీ లో నూనె వేసి వేడిఅయ్యాక ఉడికిన దొండకాయలు వేసి వేయించాలి.
  4. ఈలోపు మరో బాణీ పెట్టి నూనె వేసి అందులో జీడిపప్పు, బాదాం, కొబ్బరి, నువ్వులు,పల్లీలు,దాల్చినచెక్క,ఎండుమిర్చి ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి.
  5. అవి చల్లారిన తరువాత రుచికి సరిపడ ఉప్పు మరియు తగినన్ని నీళ్లు పోసి ముద్ద లా చేసుకోవాలి.
  6. ఇప్పుడు వేగిన దొండకాయలు తీసి పక్కన పెట్టుకొని ఈ ముద్ద ను కురుకోవాలి.
  7. ఇప్పుడు మళ్ళి ఒక బాణీ పెట్టి నూనె వేసి జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ వేసి వేయించి మిగిలిన ముద్ద వేసి నీళ్లు పోసి నూనె తేలే వరకు ఉడికించాలి.
  8. అందులో కొంచం పంచదార చింత పండు రసం వేయాలి.
  9. అందులో పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకొని మసాల నింపి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లుకుంటే అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి దొండకాయ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర