హోమ్ / వంటకాలు / మలాయి కోఫ్తా కర్రీ

Photo of Malai kofta curry by Shilpa Deshmukh at BetterButter
637
2
0.0(0)
0

మలాయి కోఫ్తా కర్రీ

May-13-2018
Shilpa Deshmukh
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలాయి కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

మలాయి కోఫ్తా కర్రీ రుచితో పాటు ఎంతో పౌష్ఠికరమైన వంటకం. పలు కూరగాయలతో తయారు చేసుకునే ఈ వంటకం మన బంధు మిత్రులతో జరుపుకునే విశేష సందర్భాలకు కూడా ఎంతో బాగుంటుంది. పిన్నా పెద్ద అందరిని మెప్పించే ఈ వంటకం ఇంట్లో తయారు చేసుకోవటం కూడా ఎంతో సులువు.రోజు వారి సామగ్రి కి కాస్త మసాలాలు జోడించి తేలికగా తయారు చేసుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ : 200 గ్రా
  2. 2 : బంగాళాదుంపలు
  3. 2 చెంచాలు : ధనియాల పొడి
  4. 2 : టమోటా
  5. 2 : ఉల్లిపాయలు
  6. జీడిపప్పులు : 7-8
  7. 2 చెంచాలు : చమురు /నూనె / నెయ్యి
  8. బిర్యానీ ఆకు : 1
  9. 1 చెంచాడు : ఎండు కారం
  10. ఉప్పు : రుచికి సరిపడ
  11. 1 చెంచా : గరం మసాలా పొడి
  12. 2 : మిరపకాయలు
  13. 2 చెంచాలు : కార్న్ ఫ్లోర్
  14. 2 చెంచాలు : కొత్తిమీరు
  15. 1/4 చెంచా : పసుపు

సూచనలు

  1. ఒక పాన్ లో 1 చెంచాడు నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, జీడిపప్పు,మిరపకాయలు వేసి వేయించండి.ఆ పైన కొన్ని నీళ్ళు పోసి 5-7 నిమిషాలు పాటు చిన్న మంట మీద ఉడకనివ్వండి.
  2. ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తరవాత మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
  3. మిక్సింగ్ గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప, తురిమిన పన్నీర్, రుచికి సరిపడ ఉప్పు, కొర్నోఫ్లర్, సన్నగా తరిగిన కొత్తిమీరు వేసి ముద్దలా కలుపుకోండి.
  4. ఈ తయారు మిశ్రమాన్ని కోడి గుడ్డు ఆకారంలో కోఫ్తాలు తయారు చేసుకోండి.
  5. ఒక పాన్ లో కోఫ్తాలు వేయించడానికి సరిపడ నూనె పోసి వేడి చేసుకొండి. ఆ పైన తయారు చేసుకున్న కోఫ్తాలు దోరగా బంగారు రంగు వచ్చే వరకు చేయించి పక్కన పెట్టుకోండి.
  6. ఇప్పుడు మరొక పాన్ లో 2 చెంచాల నూనె వేసి వేడి చెయ్యండి ఆ తర్వాత బిర్యానీ ఆకు , రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు సన్నని సెగ మీద ఉడికించుకోండి.
  7. ఆ తరువాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా మరియు అర గ్లాస్ నీళ్లు పోసుకొని 6 నుండి 8 నిమిషాల పాటు మరిగించండి.
  8. ఇప్పుడు మన కోఫ్తా గ్రేవీ రెడి దీనికి వేయించి పెట్టుకున్న కోఫ్తాలు జోడించి రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి.
  9. ఇప్పుడు ఎంతో రుచికరమైన కోఫ్తా కర్రీ తయారు. మీరూ చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర