మొలకలతో మజా | Sprouts Celebration Recipe in Telugu

ద్వారా Suma Malini  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sprouts Celebration recipe in Telugu,మొలకలతో మజా, Suma Malini
మొలకలతో మజాby Suma Malini
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

మొలకలతో మజా వంటకం

మొలకలతో మజా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sprouts Celebration Recipe in Telugu )

 • మిగిలిన మొలకలు (పెసర)
 • బ్రడ్ (ఐఛ్ఛికం)
 • బంగాళదుంప చిన్నది ఒకటి
 • ఉల్లిపాయ చిన్నది 1
 • అల్లం, వెల్లుల్లి చిన్న ముక్కలు (ఐఛ్ఛికం)
 • గరం మసాలా 3 చిటికెలు
 • జీలకర్ర చిన్న చెంచాడు
 • వెన్న పూస చెంచాడు
 • కరివేపాకు

మొలకలతో మజా | How to make Sprouts Celebration Recipe in Telugu

 1. పదార్ధాలును సిద్ధం చేసుకోవాలి.
 2. ఉల్లి, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర రుబ్బుకోవాలి.
 3. మొలకలు బరకగా రుబ్బుకోవాలి.
 4. బ్రెడ్ పొడి చేసుకోవాలి.
 5. బంగాళదుంప తురుము కోవాలి.
 6. వెన్న పూస బాణలిలో వేసి కరిగాక ఉల్లి మిశ్రమాన్ని వేయాలి. వేగాక మిగతావి అన్ని వేసి బాగా కలియబెట్టాలి.
 7. మూతపెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
 8. ఒక పల్లానికి చిన్న వెన్న పూస రాసి మగ్గించిన మిశ్రమాన్ని పల్చగా పరచాలి.
 9. నచ్చిన ఆకారంలో కట్ చేయించాలి.
 10. నచ్చిన పప్పులతో అలంకరించుకోవాలి.
 11. 10 నిమిషాలు 200 డిగ్రీల ఉష్ణోగ్రత తో హాట్ ఎయిర్ ఫైయర్ వేడి చేయాలి.
 12. తయారు చేసుకున్న ఆకారాలను హాట్ ఎయిర్ ఫైయర్ లో నేర్చుకోవాలి.
 13. 10 నిమిషాలు 100 డిగ్రీల ఉష్ణోగ్రత తో. కాల్చుకోవాలి.

నా చిట్కా:

మొలకలు ఇష్టం లేని వాళ్ళకి, అలవాటు లేని వారికి ఇలా పరిచయం చేయాలి. మిగిలిన పెద్దగా మొలక వచ్చిన ఏ గింజలుఅయినా వాడుకోవచ్చు.

Reviews for Sprouts Celebration Recipe in Telugu (0)