కారపూస | Sev Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sev recipe in Telugu,కారపూస, Revathi Kumari
కారపూసby Revathi Kumari
 • తయారీకి సమయం

  16

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

5

0

కారపూస వంటకం

కారపూస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sev Recipe in Telugu )

 • సెనగపిండి 1 కప్పు
 • బియ్యంపిండి 1 కప్పు
 • ఉప్పు తగినంత
 • కారం 1 చెంచా
 • వాము 1 చెంచా
 • నూనె వేయించడానికి సరిపడా
 • నీళ్లు సరిపడా
 • నూనె వేయించడానికి సరిపడ

కారపూస | How to make Sev Recipe in Telugu

 1. ముందుగా ఒక బాణీ లో వేయించటానికి నూనె పోసుకొని కాచుకోవాలి
 2. నూనె వేడెక్కే లోపు ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యంపిండి , సెనగపిండి , ఉప్పు , కారం , వాము వేసి బాగా కలుపుకోవాలి
 3. అందులో సరిపడినన్ని నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి
 4. ఇప్పుడు జంతికల గొట్టం లో కొంచెం నూనె రాసుకోవాలి
 5. అందులో ముందుగా చేసుకున్న పిండి ని వేసి నూనె లో జంతికలు ఒత్తుకోవాలి .
 6. దానిని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
 7. వేగి , చల్లారాక ముక్కలు చేసుకోవాలి
 8. దేనిని టీ తో పాటు తింటే చాలా బాగుంటుంది

నా చిట్కా:

దేనిని ఒక గాలి చొరబడని డబ్బా లో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Sev Recipe in Telugu (0)