హోమ్ / వంటకాలు / కారం మురుకులు

Photo of Spicy muruku by Sree Sadhu at BetterButter
826
4
5.0(0)
0

కారం మురుకులు

May-24-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం మురుకులు రెసిపీ గురించి

ఇవి చాలా గుల్లగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి-2 కప్స్
  2. జీలకర్ర--1 చెంచా
  3. ఉప్పు---తగినంత
  4. ఎర్ర కారం --1 1/2 చెంచా
  5. ఇంగువ--1/2 చెంచా
  6. నూనె--3 కప్స్(వేయించడానికి)

సూచనలు

  1. పెద్ద గిన్నె లో బియ్యప్పిండి జీలకర్ర ఉప్పు ఎర్ర కారం ఇంగువ వేసి బాగా కలపాలి.
  2. తరువాత 5 లేక 7 స్పూన్స్ వేడి నూనె వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
  3. పిండి నూనె లో కలిపినాక కొద్దిగా పిండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా లా అతుక్కోవాలి.
  4. పొడి పొడి గా పడిపోకుండా ఉండాలి.(ఒకవేల పిండి పొడి పోడి గా రాలుతుంటే కొద్దిగా నూనే వేసుకోవాలి)
  5. తరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తు గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
  6. తరువాత నూనె వేడికి పెట్టాలి
  7. తరువాత కొద్దిగా పిండి తీసుకొని మురుకుల గొట్టములో వేసి వేడి నూనె లో పిండాలి.
  8. మీకు నచ్చిన విధంగా మురుకల ప్లేట్స్ లో పెట్టి స్టార్ వేసుకోవచ్చు
  9. రెండువైపులా మురుకులను పచ్చిదనం పోయేలా వేయించాలి.
  10. వేయించిన మురుకులను ప్లేట్ లో పేపర్ వేసి పేపర్ మీద తీయాలి.(పేపర్ లో వేయడం వల్ల ఎక్కువగా ఉండే నూనె పేపర్ పీల్చుకుంటుంది).
  11. ఎంతో రుచిగా ఉండే కరకరలాడే బియ్యప్పిండి మురుకులు /జంతికలు రెడి.
  12. ఇవి డబ్బాలో వేసుకోని పెట్టుకుంటే నెల రోజులదాక నిల్వ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర