చుడువా | Chidva Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Chidva by Sree Vaishnavi at BetterButter
చుడువాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

చుడువా వంటకం

చుడువా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chidva Recipe in Telugu )

  • అటుకులు--1/2 కేజి
  • నూనె--1 టేబుల్ స్పూన్
  • శనగ పప్పు--2 చెంచా
  • ఆవాలు--1 చెంచా
  • జీలకర్ర--1 చెంచా
  • ఇంగువ-- 1/4 చెంచా
  • పసుపు--1/2 చెంచా
  • వేరు శనగ పప్పు--2 చెంచా
  • పప్పులు--2 చెంచా
  • జీడిపప్పు--2 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • కారం---1/4 చెంచా
  • కరివేపాకు---3 రెమ్మలు
  • కొబ్బెర ముక్కలు--2 టేబుల్ స్పూన్స్
  • చెక్కర--2 స్పూన్స్

చుడువా | How to make Chidva Recipe in Telugu

  1. స్టవ్ మీద ఒక పెద్ద బాణలి లో అటుకులు వేసి కొద్దిగా వేడి అయ్యేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.(నూనె వేయకుండా)
  2. వేరు శనగ విత్తనాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత బాణలి లో నూనె వేసి వేడి అయ్యాక, శనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగినాక, స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ ,పసుపు, కారం, కరివేపాకు, జీడిపప్పు, వేరు శనగ పప్పు, కొబ్బెర ముక్కలు, పప్పులు వేసి బాగా కలపాలి.
  4. తరువాత అందులోకి వేయించిన అటుకులు వేసి బాగా కలపాలి.
  5. చివరిలో 2 స్పూన్స్ చెక్కర వేసి కలపాలి.
  6. ఎంతో రుచిగా ఉండే చుడువా తయారు అయ్యిపోయింది

నా చిట్కా:

దీనిని ఒక డబ్బ లో పెడితే నిల్వ వుంటుంది

Reviews for Chidva Recipe in Telugu (0)