హోమ్ / వంటకాలు / చుడువా

Photo of Chidva by Sree Sadhu at BetterButter
1488
6
0.0(0)
0

చుడువా

May-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చుడువా రెసిపీ గురించి

ఇది తక్కువ నూనె వంటకం చాలా రుచిగా వుంటుంది మరియు ప్రయణాల అప్పుడు చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు--1/2 కేజి
  2. నూనె--1 టేబుల్ స్పూన్
  3. శనగ పప్పు--2 చెంచా
  4. ఆవాలు--1 చెంచా
  5. జీలకర్ర--1 చెంచా
  6. ఇంగువ-- 1/4 చెంచా
  7. పసుపు--1/2 చెంచా
  8. వేరు శనగ పప్పు--2 చెంచా
  9. పప్పులు--2 చెంచా
  10. జీడిపప్పు--2 టేబుల్ స్పూన్స్
  11. ఉప్పు తగినంత
  12. కారం---1/4 చెంచా
  13. కరివేపాకు---3 రెమ్మలు
  14. కొబ్బెర ముక్కలు--2 టేబుల్ స్పూన్స్
  15. చెక్కర--2 స్పూన్స్

సూచనలు

  1. స్టవ్ మీద ఒక పెద్ద బాణలి లో అటుకులు వేసి కొద్దిగా వేడి అయ్యేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.(నూనె వేయకుండా)
  2. వేరు శనగ విత్తనాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత బాణలి లో నూనె వేసి వేడి అయ్యాక, శనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగినాక, స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ ,పసుపు, కారం, కరివేపాకు, జీడిపప్పు, వేరు శనగ పప్పు, కొబ్బెర ముక్కలు, పప్పులు వేసి బాగా కలపాలి.
  4. తరువాత అందులోకి వేయించిన అటుకులు వేసి బాగా కలపాలి.
  5. చివరిలో 2 స్పూన్స్ చెక్కర వేసి కలపాలి.
  6. ఎంతో రుచిగా ఉండే చుడువా తయారు అయ్యిపోయింది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర