హోమ్ / వంటకాలు / మామిడికాయ కస్టర్డ్

Photo of MANGO CUSTARD by Tejaswi Yalamanchi at BetterButter
553
3
0.0(0)
0

మామిడికాయ కస్టర్డ్

May-24-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ కస్టర్డ్ రెసిపీ గురించి

పాలు , నీళ్లు ,పంచదార లేదా ధాన్యం పిండితో తయారు చేసే తీపి పదార్థం .నేను పాలతో చేశాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కస్టర్డ్ పేకెట్ ఒకటి
  2. పావు కిలో చక్కెర
  3. పాలు ప్యాకెట్ ఒకటి 500 మీ.లి.
  4. మామిడికాయలు ముక్కలు
  5. చెర్రి ముక్కలు

సూచనలు

  1. కస్టర్డ్ పాకెట్ ఒకటి తీసుకోండి
  2. పావుకిలో పంచదార తీసుకోండి
  3. ఒక పాల పేకెట్ తీసుకోండి.ఇది 500 మీ.లి. పేకెట్ .500 మీ.లి.మూడు చెంచాల కస్టర్డ్ పొడి సరిపోతుంది
  4. పోయి మీద గిన్నె పెట్టి దానిలో పాలు పోసి కగానీవండి
  5. చిన్న గ్లాసులో 3 చెంచాల కస్టర్డ్ పొడి వేసుకోండి
  6. నీళ్లు కలిపి ఉండలు లేకుండా చేసుకోండి
  7. పాలు కాగాక
  8. దాంట్లో పంచదార వేసి కరిగేదాకా కలుపుకోండి
  9. ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమం నీ దాంట్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి
  10. పది నిమిషాలపాటు బాగా తిప్పుతూ ఉండాలి ఆ మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది
  11. ఇప్పుడు పోయి అపి కస్టర్డ్ ని కాసేపు చాలరనివండి
  12. చల్లారాక ఒక బౌల్లోకి / ప్లాస్టిక్ డబ్బా లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టండి
  13. డీప్ ఫ్రిజ్లో లో పెడితే బాగా గట్టిగా అవుతుంది.కావలిసిన పండ్ల ముక్కలు వేసుకొని తినొచ్చు.
  14. కస్టర్డ్ గట్టి పడక
  15. ఒక గిన్నెలో కస్టర్డ్ తీసుకుని దానిపైన మామిడికాయ ముక్కలు చెర్రీ ముక్కలు వేసుకొని చక్కగా ఆస్వాదించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర