హోమ్ / వంటకాలు / వెజిటబుల్ చీజ్ బాల్స్

Photo of Vegetable Cheese Balls by Tejaswi Yalamanchi at BetterButter
501
2
0.0(0)
0

వెజిటబుల్ చీజ్ బాల్స్

May-25-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ చీజ్ బాల్స్ రెసిపీ గురించి

దీనిలో బంగాళదుంపను మెత్తగా ఉడికించుకొని మెత్తగా చేసుకొని దానిలో క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మొక్కజొన్న పిండి,మైదా పిండి,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారం వేసి కలుపుకొని వాటి ఉండలుగా చేసుకొని వాటి లోపల చీజ్ పెట్టి మైదా ని నీళ్లలో కలిపి వాటిలో బాల్స్ ని ముంచి తరవాత బ్రెడ్డుక్రయంప్స్ పాటిం ఫ్రై చేసుకుంటాం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళాదుంపలు 2
  2. పచ్చిమిర్చి 2
  3. కారం ఒక చెంచా
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. మైదా 2 చెంచాలు
  6. మొక్కజొన్న పిండి 3 చెంచాలు
  7. క్యారట్ 1
  8. చీజ్ పేకెట్ 1
  9. ధనియాల పొడి సగం చెంచా
  10. అల్లంవెల్లులి పేస్ట్ 1 చెంచా
  11. గరం మసాలా సగం చెంచా
  12. బ్రెడ్డుక్రయంప్స్ కొదిగా

సూచనలు

  1. బంగాళదుంప క్యారెట్ పచ్చిమిర్చి తీసుకోండి
  2. గరంమసాల పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లిపేస్ట్ తీసుకోండి
  3. ఉప్పు కారం తీసుకోండి
  4. క్యారెట్ పచ్చిమిర్చిలను ముక్కలుగా కోసుకోండి
  5. బంగాళదుంపలను కుక్కర్లో వేసి నీళ్ళు పోసుకొని పోయి మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి
  6. మూడు చీజ్ స్లైస్లను తీసుకోండి
  7. ఒకదాని మీద ఒకటి పెట్టండి
  8. ఇలా ముక్కలుగా చేసుకోండి
  9. బంగాళాదుంపలు ఉడికాక పైన తొక్క తీసి గిన్నె లో వేసుకోండి
  10. మెత్తగా ఇలా చేస్కోండి
  11. మెత్తగా చేసుకున్న దుంపలో క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కారం అల్లంవెల్లుల్లి పేస్ట్ ధనియాలపొడి గరంమసాలా వేసుకోండి
  12. మొక్కజొన్న పిండి మైదా వేసుకోండి
  13. మొత్తం కలిపి మిశ్రమాన్ని ఇలా చేసుకోండి
  14. వాటిని ఉండలుగా చేసుకోండి
  15. ఉండలను మెత్తగా ఒత్తి వాటి మధ్యలో చీజ్ పెట్టండి
  16. మళ్లీ వాటిని ఉండల్లా చేసుకోండి
  17. ఒక బౌల్ తీసుకొని కాస్త నీరు పోసుకొని, ఒక చెంచా మొక్కజొన్న పిండి వేసుకుని ఇలా కలుపుకొండి
  18. ఇలా చేసుకోండి
  19. బ్రెడ్డుక్రయంప్స్ తీసుకోండి
  20. ఉండాలని మొక్కజొన్న పిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్డుక్రయంప్స్ లో దొలించండి
  21. ఇలా చేసుకొని పెట్టుకోండి
  22. పోయి పైన డీప్ ఫ్రై కి బండి పెట్టుకొని నునె వేసుకొని వేడి చేయండి
  23. నూనె కాగాక ఉండలు వేసుకొని వేయించండి.బంగారు రంగు వొచ్చేదాక వేయించండి
  24. వేగాక విడిగా తీసుకొని పళ్లెం లో పెట్టుకోండి
  25. బంగాళదుంప క్యారెట్ చీజ్ బాల్స్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర