మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు | Curd Bajjis Recipe in Telugu

ద్వారా Suma Malini  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Curd Bajjis recipe in Telugu,మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు, Suma Malini
మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలుby Suma Malini
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు వంటకం

మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curd Bajjis Recipe in Telugu )

 • గోధుమ పిండి (కడిగి ఆరబెట్టీ మరపట్టించినది) 250గ్రా
 • పుల్ల పెరగు 50గ్రా
 • అల్లం అంగుళం ముక్క
 • ఉల్లిపాయలు 2 పెద్దవి
 • పచ్చి మిర్చి 3
 • జీలకర్ర 1 చెంచాడు
 • నూనె వేయించడానికి లేదా వెన్న పూస
 • ఉప్పు రుచికి తగినంత (పుల్ల పెరుగు వల్ల చూసి వేయండి)
 • చిటికెడు పసుపు

మొసరు (మజ్జిగ) లేదా మైసూర్ బజ్జీలు | How to make Curd Bajjis Recipe in Telugu

 1. ఉల్లి, మిర్చి, అల్లం, కరివేపాకు సన్నగా తరగాలి.
 2. ఉప్పు, జీలకర్ర వేసి నీరు వచ్చేలా నలపాలి.
 3. పెరుగు వేయాలి.
 4. గోధుమ పిండి వేయాలి.
 5. బాగా కలపాలి.
 6. నూనె వేడెక్కిన తర్వాత వేసి వేయించాలి.
 7. దోరగా వేయించుకొని తీయాలి.
 8. మరి మాకు అధిక బరువు, సమస్య నూనె నిషిద్ధం అంటారా? అయితే ఇలా ఆనందించండి. వెన్న పూస రాసి గుంటూరు మూకుడులో వేసుకోవాలి.
 9. మూతపెట్టి ఇగిరాక వెన్న పూస రాసి తిప్పి కాల్చుకోవాలి.
 10. నిజానికి నూనె లో వేయించిన వాటికంటే ఇవే రుచి మరి గోరువెచ్చగా తిని చూడండి. గోధుమ రొట్టెలు చేసీకోలెనప్పుడు, కోరికలు చంపుకొలేనప్పుడు హాయిగా, ధైర్యంగా ప్లేటునిండా పెట్టుకుని తినండి.

నా చిట్కా:

వెన్న తీసిన మజ్జిగతో కూడా చేసుకోవచ్చు. జొన్న లేదా వేరే చిరుధాన్యాల పిండి కలుపుకొని వేస్తే కరకరలాడుతూ ఉంటాయి.

Reviews for Curd Bajjis Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo