మసాలా పూరీలు | Masala poori Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala poori recipe in Telugu,మసాలా పూరీలు, Sree Vaishnavi
మసాలా పూరీలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

మసాలా పూరీలు వంటకం

మసాలా పూరీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala poori Recipe in Telugu )

  • సజ్జపిండి - మూడుకప్పులు
  • గోధుమపిండి - అరకప్పు
  • కారం - చెంచా
  • జీలకర్రపొడి - ఒకటిన్నర చెంచా
  • ఆమ్‌చూర్‌పొడి - చెంచా
  • నువ్వులు - టేబుల్‌స్పూను
  • మెంతి ఆకుల తరుగు - ముప్పావు కప్పు
  • ఉప్పు -తగినంత
  • పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు
  • చింతపండు - టేబుల్‌స్పూను
  • ఎండు మిర్చి- ఐదు
  • వెల్లుల్లిరెబ్బలు - ఎనిమిది
  • నూనె - వేయించడానికి సరిపడా
  • చాట్‌మసాలా - చెంచా

మసాలా పూరీలు | How to make Masala poori Recipe in Telugu

  1. ఓ గిన్నెలో సజ్జపిండీ, గోధుమపిండీ, కారం, అరచెంచా జీలకర్రా,ఆమ్‌చూర్‌పొడీ, నువ్వులూ, మెంతి ఆకుల తరుగూ, తగినంత ఉప్పూ,పెరుగూ తీసుకుని బాగా కలపాలి.
  2. మరో గిన్నెలో పిండి కలపడానికి సరిపడానీళ్లు తీసుకుని వేడిచేయాలి.
  3. అందులో చింతపండూ, రెండు ఎండుమిర్చీ, నాలుగైదు వెల్లుల్లి ముక్కలూ వేసేయాలి.
  4. తరవాత చింతపండును తీసేయాలి.
  5. ఈ నీటితో పిండిని కలపాలి.
  6. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి.
  7. వీటిని కాగుతోన్ననూనెలో వేసి కాల్చుకుంటే సరిపోతుంది.
  8. మిగిలిన జీలకర్ర పొడీ, చింతపండుగుజ్జూ, వెల్లుల్లి రెబ్బలూ, ఛాట్‌మసాలా, తగినంత ఉప్పూ తీసుకుని చట్నీలాచేసుకోవాలి.
  9. పూరీలను ఈ చట్నీతో కలిపి వడ్డించాలి.

నా చిట్కా:

సజ్జపిండి బదులుగా మీరు ఏ పిండినైనా వాడుకోవచ్చు

Reviews for Masala poori Recipe in Telugu (0)