క్రిస్పీ పల్లీ పకోడీ | Crispy peanut pakoda Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Crispy peanut pakoda recipe in Telugu,క్రిస్పీ పల్లీ పకోడీ, Sree Vaishnavi
క్రిస్పీ పల్లీ పకోడీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

క్రిస్పీ పల్లీ పకోడీ వంటకం

క్రిస్పీ పల్లీ పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crispy peanut pakoda Recipe in Telugu )

  • పల్లీలు: 2 కప్పులు
  • శెనగపిండి: 1.5కప్పులు
  • కరివేపాకు: మూడు రెమ్మలు
  • నూనె: వేయించటానికి సరిపడా
  • ఉప్పు: రుచికి తగినంత
  • మిరపపొడి: 1చెంచా
  • ధనియాలపొడి: 1/2 చెంచా
  • గరంమసాలా: 1/2 చెంచా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: 1చెంచా
  • కొత్తిమీర: చిన్న కట్ట

క్రిస్పీ పల్లీ పకోడీ | How to make Crispy peanut pakoda Recipe in Telugu

  1. ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి
  2. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి.
  3. తర్వాత పాన్ లో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి,తీసుకోవాలి
  4. అంతే పల్లీ పకోడీ రెడీ..

Reviews for Crispy peanut pakoda Recipe in Telugu (0)