పానీ పూరి | Pani puri Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Pani puri by Sree Vaishnavi at BetterButter
పానీ పూరిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

పానీ పూరి వంటకం

పానీ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pani puri Recipe in Telugu )

 • ఒక కప్పు బొంబాయి రవ్వ
 • మూడు చెంచాలు మైదా
 • పావు చెంచా బేకింగ్ సోడా
 • ఉప్పు తగినంత
 • వేయించేందుకు సరిపడా వంట నూనె.
 • 5-6 ఉసిరికాయలు
 • రెండు కప్పుల నీరు
 • రెండు చెంచాలు జీలకర్ర పొడి
 • రెండు చెంచాలు జీలకర్ర
 • మూడు పచ్చి మిరపకాయలు
 • ఒక కప్పు పుదీనా ఆకులు
 • ఒక చెంచా నల్ల ఉప్పు
 • అర కప్పు కీర
 • అర కప్పు కొత్తిమీర ఆకులు
 • రెండు బంగాళాదుంపలు
 • రెండు తరిగిన పచ్చి మిరపకాయలు
 • రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు
 • రుచి కోసం కాస్తంత ఉప్పు
 • ఉడికించిన బఠాణి 1 కప్

పానీ పూరి | How to make Pani puri Recipe in Telugu

 1. ఒక పాత్ర తీసుకుని అందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి
 2. కాస్తంత ఉప్పు వేసి, వేడి నీరు పోసి బాగా కలిపిన తర్వాత 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
 3. ఆ తర్వాత పిండిని చాలా చిన్న పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి.
 4. ఇప్పుడు పానీ కి మిక్సీ జార్ లో ఉసిరికాయ, పుదీనా ,జీలకర్ర ,పచ్చిమిర్చి, వేసి పేస్ట్ చేసుకోవాలి
 5. దీనికి నీటిని కలుపుకోవాలి.
 6. తర్వాత పానీకి సంబంధించి ఇతర ముడి పదార్థాలను కూడా కలపాలి.
 7. మీ రుచికి అనుగుణంగా కొన్ని ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు
 8. బంగాళాదుంపలను ఉడకబెట్టి దించేయాలి.
 9. బఠాణి కూడా మెత్తగా ఉడకబెట్టుకోవాలి
 10. వీటిని గుజ్జుగా చేసి పొయ్యిపై పెనం పెట్టి కాస్తంత నూనె వేసి ఈ మిశ్రమంలో తరిగిన పచ్చి మిరపకాయలు, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
 11. వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి గరిటెతో కలియబెడుతూ వేడెక్కిన తర్వాత దించేయాలి. దీంతో స్టఫ్ రెడీ.
 12. అంతే పూరి లో కూర పానీ వేసుకొని తినడమే

Reviews for Pani puri Recipe in Telugu (0)