రాజా గింజలు | Healthy Royal Nuts Recipe in Telugu

ద్వారా Suma Malini  |  30th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Healthy Royal Nuts recipe in Telugu,రాజా గింజలు, Suma Malini
రాజా గింజలుby Suma Malini
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

రాజా గింజలు వంటకం

రాజా గింజలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Healthy Royal Nuts Recipe in Telugu )

 • బాదం పప్పు 20
 • జీడిపప్పు 15
 • ఆక్రుట్ 5
 • పండు మిర్చి పేస్ట్ చిన్న చెంచాడు
 • బియ్యం పిండి 1 చెంచాడు
 • గోధుమ పిండి 1 చెంచాడు
 • రంగు కోసం చిటికెడు పసుపు (బీట్ రూట్ రసం లేదా క్యారెట్ రసం వాడచ్చు)
 • వేయించిన జీలకర్ర పొడి (ఐచ్ఛికం)

రాజా గింజలు | How to make Healthy Royal Nuts Recipe in Telugu

 1. గింజలును నానబెట్టాలి.
 2. బాదం గింజలను మధ్యకు కోసి తొక్క వేరు చేయాలి. జీడిపప్పు మధ్యకు కోసి శుభ్రం చేసుకోవాలి.
 3. మిక్సీలో అక్రూట్ చెంచాడు పండు మిర్చి పేస్ట్, చెంచాడు బియ్యం పిండి వేయాలి.
 4. చెంచాడు గోధుమ పిండి, పెద్ద చెంచాడు పెరుగు చిటికెడు పసుపు, వెన్న పూస కొంచెం వేసి మిక్స్ చేయాలి.
 5. ఈ పిండితో ,4 చెంచాలు నువ్వులు కలపాలి.
 6. జీడిపప్పు, కలపాలి.
 7. బాదం పప్పు కలపాలి.
 8. హాట్ ఎయిర్ ఫైయర్ 10 నిమిషాలు 200 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వేడి చేయాలి.
 9. తోపు పెట్టిన గింజలుని హాట్ ఎయిర్ ఫైయర్ గ్రిల్ కు వెన్న పూస రాసి విడిగా పేర్చాలి.
 10. 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 10 నిమిషాలు కాల్చాలి.
 11. గింజలు హాట్ ఎయిర్ ఫైయర్ లోనే చల్లారాక కర కర లాడతాయి. వీటిని వేయించిన జీలకర్ర పొడి, సైంధవ లవణం జల్లుకుని తినొచ్చు. నాకు మాత్రం పెరుగు వల్ల ఉప్పు అవసరం అనిపించదు.చృసి జల్లుకోవాలి.

నా చిట్కా:

దీనిని చాట్ మసాలా ఉల్లి, కొత్తిమీర, క్యారెట్, బీట్ రూట్ తరుగుతో చాట్ గాను, సూప్ కి సైడ్ డిష్ గా కూడా వాడుకోవచ్చు.

Reviews for Healthy Royal Nuts Recipe in Telugu (0)