మటన్ హలీం | MUTTON HALEEM Recipe in Telugu

ద్వారా Ram Ram  |  1st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of MUTTON HALEEM by Ram Ram at BetterButter
మటన్ హలీంby Ram Ram
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

మటన్ హలీం

మటన్ హలీం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MUTTON HALEEM Recipe in Telugu )

 • మటన్ 300 గ్రామ్స్
 • ఎర్ర గోధుమ రవ్వ 1 కప్పు
 • సేనగపప్పు 1/4కప్పు
 • పెసరపప్పు 1/4కప్పు
 • బియ్యం 2స్పూన్లు
 • ఉల్లిపాయ చిరికలు 1 1/2కప్పు
 • పుదీనా 1కప్పు
 • కొత్తిమీర 1 కప్పు
 • పచ్చిమిర్చి 3
 • అల్లం వెల్లులి పేస్ట్ 1స్పూన్
 • గరం మసాలా 1/2స్పూన్
 • పసుపు 1/2 స్పూన్
 • కారం 1స్పూన్
 • ఉప్పు సరిపడా
 • జీడిపప్పు కొద్దిగా
 • నిమ్మకాయ 1
 • నూనె సరిపడా
 • నీళ్ళు సరిపడా

మటన్ హలీం | How to make MUTTON HALEEM Recipe in Telugu

 1. ముందుగా ఎర్ర గోధుమ రవ్వ ని ననపెట్టుకోవాలి అరగంట..అలాగే 1/4కప్పు శనగపప్పు 1/4కప్పు పెసరపప్పు 2స్పూన్లు బియ్యం కూడా ననపెట్టుకోవాలి.. తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేది పెట్టుకోవాలి పప్పుల్ని. ఇప్పుడు అరకప్పు ఉల్లిపాయలని నూనెలో ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.కాజూని నెయ్యిలో వేయించి తీసుకోవాలి..
 2. ఇప్పుడు మటన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి..ఇప్పుడు ఒక స్పూన్ కారం, 1/2స్పూన్ పసుపు,ఉప్పు 1 స్పూన్,దానియా పొడి 1స్పూన్,గరం మసాలా 1/2స్పూన్,2స్పూన్ల అల్లం వెల్లులి పేస్ట్ వేసుకోవాలి అన్ని మటన్ కి పట్టించాలి..
 3. ఇప్పుడు ఒక కప్పు నూనె.ఒక ఉల్లిపాయ చిరికలు..3 పచ్చి మిర్చి కూడా మటన్ లో వేసుకోవాలి..
 4. ఇదంతా ఒక కుక్కర్లో తీసుకుని 3 కప్పుల నీళ్లు వేసుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసి 30నిమిషాలు మీడియం సెగలో ఉడికించుకుని..30నిమిషాల తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి
 5. ఇప్పుడు మటన్ ని పప్పు గుత్తి తో బాగా మెదపాలి..తర్వాత వేరే పెద్ద గిన్నె స్టవ్ మీద మీడియం మంట మీద పెట్టి మెదిపిన మటన్ నాన పెట్టుకున్న రవ్వ ...గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమం..6 కప్పుల నీళ్లు వేసి బాగా కలుపుతూ ఉండాలి...
 6. మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి..దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి
 7. ఇప్పుడు నెయ్యిలో వేయించిన కాజు..వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ చిరికలు. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి నిమ్మరసం పిండుకోవాలి..

నా చిట్కా:

హలీం తో ఉడికించిన గుడ్డు తింటే చాలా బాగుంటుంది..

Reviews for MUTTON HALEEM Recipe in Telugu (0)