ఇరానీ సమోసా | Irani samosa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Irani samosa recipe in Telugu,ఇరానీ సమోసా, Sree Vaishnavi
ఇరానీ సమోసాby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  8

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

ఇరానీ సమోసా వంటకం

ఇరానీ సమోసా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Irani samosa Recipe in Telugu )

 • మైదాపిండి: పావుకిలో
 • జీలకర్ర: అరటీస్పూను
 • వాము: అరటీస్పూను
 • బేకింగ్‌పౌడర్‌: పావుటీస్పూను
 • నెయ్యి: టీస్పూను
 • నూనె: 2 టీస్పూన్లు
 • ఉప్పు: తగినంత
 • ఉల్లి: పావుకిలో
 • అటుకులు: అరకప్పు
 • కారం: అరటీస్పూను
 • నిమ్మరసం: టీస్పూను
 • ఉప్పు: తగినంత
 • దనియాలపొడి: పావుటీస్పూను
 • చాట్‌మసాలా: పావుటీస్పూను
 • నూనె: వేయించడానికి సరిపడా

ఇరానీ సమోసా | How to make Irani samosa Recipe in Telugu

 1. ఒక గిన్నెలో మైదా, జీలకర్ర, వాము, బేకింగ్‌పౌడర్‌, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
 2. తరవాత నెయ్యి, నూనె కూడా వేసి కలపాలి.
 3. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి పిండిముద్దను కలిపి దానిమీద సుమారు 20 నిమిషాలపాటు తడిబట్ట కప్పి ఉంచాలి.
 4. ఉల్లిముక్కల్లో అటుకులు వేసి కలపాలి.
 5. అందులోనే కారం, జీలకర్రపొడి, దనియాలపొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు కలిపి ఉంచాలి.
 6. పిండిముద్దమీద కొద్దిగా గోధుమపిండి చల్లి మళ్లీ ఓసారి కలిపి చిన్న ఉండల్లా చేయాలి.
 7. ఇప్పుడు ఒక్కో ఉండనీ చపాతీలా చేయాలి.
 8. ఇష్టమైతే చపాతీమీద నెయ్యి లేదా నూనె కూడా రాయవచ్చు.
 9. ఇప్పుడు దీన్ని రెండుగా కోసి కోన్‌లా చుట్టి స్టఫింగ్‌ మిశ్రమం పెట్టి సమోసాలా మడచాలి.
 10. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.

Reviews for Irani samosa Recipe in Telugu (0)