కప్పుతో పాలకూర | Spinach Cups Recipe in Telugu

ద్వారా Suma Malini  |  5th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spinach Cups recipe in Telugu,కప్పుతో పాలకూర, Suma Malini
కప్పుతో పాలకూరby Suma Malini
 • తయారీకి సమయం

  6

  గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

కప్పుతో పాలకూర వంటకం

కప్పుతో పాలకూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach Cups Recipe in Telugu )

 • పాలకూర 4 కట్టలు
 • గోధుమ పిండి 1 కప్పు
 • సజ్జ పిండి 4 చెంచాలు
 • ధనియాలు 1 చెంచా
 • పండు మిర్చి పేస్ట్ 1 చెంచా (కారం)
 • ఇంగువ చిటికెడు
 • నువ్వులు 4 చెంచాలు
 • అక్యూట్ 6 గింజలు
 • బాదం 15 గింజలు
 • అవిసె గింజలు 4 చెంచాలు
 • వెన్న పూస 30 గ్రా
 • పెరుగు 2 కప్పులు

కప్పుతో పాలకూర | How to make Spinach Cups Recipe in Telugu

 1. ముందుగా పాలకూర కడిగి కాడలుతో సహా సన్నగా తరగాలి.
 2. దీనిని కొంచెం పెరుగు వేసి ఉడికించాలి.
 3. ధనియాలు, ఇంగువ, పండు మిర్చి, ముద్దగా రుబ్బుకోవాలి ‌
 4. ఈ ముద్దను పాలకూరలో వేసి ఉడికించి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి.
 5. బాదం,అక్రూట్, అవిసె గింజలును పొడి చేసుకోవాలి.
 6. పుల్లని పెరుగులో పాలకూరముద్ద, గింజలు పొడి వేసి బాగా కలపాలి. కావాలి అనుకుంటే కారంపొడి మరికొంత కలుపుకోవాలి. ఉప్పు అవసరం అస్సలు ఉండదు.
 7. గొధుమ,సజ్జ పిండి కలుపుకోవాలి.
 8. ఆరు గంటలు ఊరనివ్వాలి
 9. ఊరిన పిండిలో వెన్న పూస కలపాలి.
 10. హాట్ ఎయిర్ ఫైయర్ ని 10 నిమిషాలు 200 దగ్గర వేడిచేసి మిశ్రమాన్ని సిలికాన్ కప్పు లో కింద. నువ్వులు వేసి నింపి పైన కూడా నువ్వులు చల్లాలి.
 11. ఈ కప్పులను మొదటి 10 నిమిషాలు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో తర్వాత 10 నిమిషాలు 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చుకోవాలి.
 12. కాలిన మఫిన్సను తిరగేసి మరో 10 నిమిషాలు 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చుకోవాలి.
 13. హాట్ ఎయిర్ ఫైయర్ ఆప్ చేసి చల్లారనిచ్చి ఆవ పెరుగు పచ్చడి తో వడ్డీంచాలి‌. (పచ్చి ఆవాలు ముద్ద గా నూరి పుల్లని పెరుగులో కలిపి, అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర మీగడ తో. వేయించి కచ్చాపచ్చాగ దంచి ఆవ పెరుగుకి కలపాలి‌.)

నా చిట్కా:

త్వరగా ఊరాలి అనుకుంటే ENO fruit salt కలపి వెంటనే చేసుకోవాలి.

Reviews for Spinach Cups Recipe in Telugu (0)