పైనాపిల్ పప్పుచారు | Pinaple -dal soup Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  19th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pinaple -dal soup recipe in Telugu,పైనాపిల్ పప్పుచారు, Sri Tallapragada Sri Devi
పైనాపిల్ పప్పుచారుby Sri Tallapragada Sri Devi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

About Pinaple -dal soup Recipe in Telugu

పైనాపిల్ పప్పుచారు వంటకం

పైనాపిల్ పప్పుచారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pinaple -dal soup Recipe in Telugu )

 • పైనాపిల్ చక్రాలు 4
 • పండిన టమాటాలు నాలుగు
 • చిన్న కప్పు కంది పప్పు
 • 1 చెంచాడు : ధనియాలు జీలకర్ర మిరియాలు వేయించి పొడి చేసినవి
 • 2 చెంచాలు : కొత్తిమీర తరిగినది
 • 1 రెమ్మ : కరివేపాకు
 • 4 : పచ్చిమిర్చి చీలికలు
 • 2 కప్పులు : నీళ్లు
 • ఉప్పు రుచికి సరిపడ
 • 1 చెంచాడు : నూనె
 • 1/2 చెంచా : ఆవాలు
 • 1/2 చెంచా : జీలకర్ర
 • 2 : ఎండు మిరపకాయలు

పైనాపిల్ పప్పుచారు | How to make Pinaple -dal soup Recipe in Telugu

 1. టమాటాలు , రెండు పైనాపిల్ చక్రాలు ముక్కలుగా చేసుకోవాలి
 2. కందిపప్పు ని సరిపడా నీళ్లు పోసుకొని కుక్కర్లో ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి
 3. ఉడికిన కందిపప్పును , పైనాపిల్ ముక్కలు, టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
 4. మిగిలిన రెండుపైనాపిల్ ముక్కలు టమాటాలను సన్నగా తరిగి , కొత్తిమీర , కరివేపాకు , పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా తరుక్కోవాలి .
 5. రుబ్బుకున్న పైనాపిల్, టమాట , పప్పు ఉప్పు తో పాటు ఈ ముక్కలు కూడా కలిపి రెండు గ్లాసుల నీరు పోసి మరిగించాలి. మరుగుతున్న పప్పుచారు కు ధనియాలు జీలకర్ర మిరియాలు వేయించి పొడి చేసిన పౌడర్ వేసి కలపాలి.
 6. పైనాపిల్ ముక్కలు వేసిన టమాటాలు ఉడికి మరిగాక మూకుడులో చెంచాడు నూనె వేసి అందులో ఆవాలు , జీలకర్ర , పసుపు , ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి మరుగుతున్న పప్పుచారు లో వేసుకొని కలపాలి. గుమగుమలాడే పైనాపిల్ పప్పుచారు రెడీ.

నా చిట్కా:

పైనాపిల్ ఎక్కువగా పండిపోతే పప్పు చారు మరీ తీయగా ఉంటుంది కొంచెం తక్కువ పండినది ఐతే బావుంటుంది.

Reviews for Pinaple -dal soup Recipe in Telugu (0)