బాదం హల్వా | Almonds Halwa Recipe in Telugu

ద్వారా Suma Malini  |  19th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Almonds Halwa by Suma Malini at BetterButter
బాదం హల్వాby Suma Malini
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

బాదం హల్వా

బాదం హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Almonds Halwa Recipe in Telugu )

 • బాదం పప్పు (30 గింజలు లేదా 150గ్రా)
 • చక్కెర 50గ్ర లేదా తేనె 50మి.లీ లేదా ఖర్జూర పాకం 50 మి.ల్లీ
 • కుంకుమ పువ్వు చిటికెడు
 • ఏలకులు పొడి చిటికెడు
 • పాలు (ఐఛ్ఛికం) 100 మి.ల్లీ

బాదం హల్వా | How to make Almonds Halwa Recipe in Telugu

 1. బాదం పప్పును సరిపడా నీళ్లు పోసి 6 ఘంటల పాటు నాన బెట్టాలి.
 2. నన బెట్టిన బాదాం పప్పులను రుబ్బి పాలు మరియు పిప్పి ని వేరు చేసుకోవాలి.
 3. బాదం పలుకుల్లో సహజంగా ఉండే నూనె వలన వెన్న ముద్దలాగా వస్తుంది. అదికూడా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు.
 4. పాలను కుంకుమ పువ్వు తో మరిగించాలి.
 5. ఇప్పుడు బాదం ముద్ద, బాదం పాలు మరిగించిన కుంకుమ పువ్వు పాలతో కలిపి తగిన చక్కెర తో కలిపి ఉడికించాలి.
 6. దగ్గర పడే వరకు ఉడికించాలి.
 7. ముద్దగా అయ్యాక దించాలి.
 8. ఇలాగే బాదం పాలు మరిగించిన తర్వాత కొంత పాలలో తేనె కలిపి ఉడికించాలి.
 9. పంచదార పడని వాళ్ళకు ముందు గా పాలు దగ్గరగా ఉడికించిన తర్వాత తేనె కలిపి 3 నిమిషాలు ఉడికించి దించేయాలి.
 10. మరికొన్ని పాలలో ఖర్జూర పాకం కలిపి ఉడికించాలి. ఆస్థమా ఉన్నవారికి ఖర్జూరం మంచిది‌
 11. దగ్గరగా ఉడికించి దించేయాలి.
 12. ఎంతో ఆరోగ్యకరమైన బాదాం హల్వా రెడీ మీకు నచ్చిన తీపి తో చేసుకొని ఆనందించండి .

నా చిట్కా:

కుంకుమ పువ్వు బదులు కేసర్, బాదం పాలపొడి కలిపి చేయొచ్చు. వేగన్ డైట్ వాళ్ళు ఉత్త బాదంపాలు ఖర్జూర పాకం కలిపి చేసుకోవచ్చు.

Reviews for Almonds Halwa Recipe in Telugu (0)