క్యారెట్ హల్వా | Carrot halwa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Jun 2018  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot halwa recipe in Telugu,క్యారెట్ హల్వా, Sree Vaishnavi
క్యారెట్ హల్వాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    12

    నిమిషాలు
  • వండటానికి సమయం

    41

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

1

క్యారెట్ హల్వా వంటకం

క్యారెట్ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot halwa Recipe in Telugu )

  • 3/4 కప్పుల పాలు
  • 6 క్యారెట్లు
  • 1 స్పూన్ యాలుకల పొడి
  • 3 టేబుల్ స్పూన్ల నెయ్యి
  • 5 టేబుల్ స్పూన్ల పంచదార
  • 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
  • 4 టేబుల్ స్పూన్ల బాదం పప్పులు

క్యారెట్ హల్వా | How to make Carrot halwa Recipe in Telugu

  1. ఒక మందపాటి పాన్ లో పాలను పోసి మరగబెట్టండి
  2. పాలు మరిగిన తర్వాత క్యారెట్ తురుము, యాలకుల పొడిని వేసి కలియబెట్టాలి.
  3. సన్నని సెగపై ముప్పై నుంచి నలభై నిమిషాలపాటు దెగ్గరపడేంత వరకు ఉడికించాలి.
  4. నీరంతా ఇగిరిపోయాక నెయ్యి, పచదార, ఎండు ద్రాక్ష , బాదంపప్పుల పలుకులు వేసి మరో 5 నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంటే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా రెడీ .
  5. చల్లగా లేదా వేడిగా ఎవరిష్టానుసారం వారు తీసుకోవచ్చును. క్యారెట్ హల్వా ని వనీల ఐస్క్రీమ్ తో పాటు వేసివిలో సర్వ్ చేసుకుంటే మీ పిల్లలు ఎగిరి గంతేసి మిమ్మల్ని హత్తుకుంటారు.

నా చిట్కా:

మీకు ఇష్టమైయితే కాజు ,ఆక్రూట్ లాంటి పలుకులు కూడా వేయించుకొని వేసుకోవచ్చు.

Reviews for Carrot halwa Recipe in Telugu (1)

Revathi Kumari5 months ago

Yummy
జవాబు వ్రాయండి