మజ్జిగ పులుసు | Maggiga pulusu Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  21st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Maggiga pulusu recipe in Telugu,మజ్జిగ పులుసు, Sri Tallapragada Sri Devi
మజ్జిగ పులుసుby Sri Tallapragada Sri Devi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

About Maggiga pulusu Recipe in Telugu

మజ్జిగ పులుసు వంటకం

మజ్జిగ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Maggiga pulusu Recipe in Telugu )

 • ఆనపకాయ ముక్కలు 1/2 కప్పు
 • బెండ కాయలు 4
 • టమాట 1
 • చిన్న అల్లం ముక్క
 • పచ్చిమిరపకాయలు. 4
 • కొత్తిమీర కొద్దిగా
 • కరివేపాకు రెండు రెమ్మలు
 • ధనియాలు 1 స్పూన్
 • జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్
 • పచ్చి కొబ్బరి ముక్క 1 చిన్నది
 • మిరియాలు 4
 • పసుపు 1/4 చెంచా
 • ఎండుమిరపకాయలు 2
 • శెనగపిండి 4 చెంచాలు
 • పెరుగు 1 పెద్ద కప్పు
 • నీళ్లు 2 గ్లాసులు
 • ఉప్పు రుచికి సరిపడ

మజ్జిగ పులుసు | How to make Maggiga pulusu Recipe in Telugu

 1. ఆనపకాయ, బెండకాయ , టమాటా, పచ్చిమిరపకాయలు తరిగి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి
 2. తరిగిన ముక్కలు అన్నిటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి
 3. ధనియాలు ,మిరియాలు ,జీలకర్ర ,పచ్చికొబ్బరి, ఎండుమిర్చి రుబ్బుకోవాలి. అల్లం పచ్చిమిర్చి కూడా చేర్చుకోవాలి
 4. అల్లం ముక్క, కొబ్బరి ధనియాలు మిరియాలు జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ కావడం కోసం ఒక చెంచాడుపెరుగుఇందులో వేసుకోవచ్చును
 5. తీసుకున్న పెరుగుకు శనగపిండి కలిపి గ్రైండ్ చేయాలి. ముందు గ్రైండ్ చేసుకున్న ధనియాలు కొబ్బరి మసాలా ను కూడా ఈ పెరుగు కలిపి గ్రైండ్ చేయాలి
 6. మసాలాతో పాటు గ్రైండ్ చేసిన మజ్జిగను ఉడికిన ముక్కలు కలిపి స్టౌ మీద సిమ్ లో ఉంచి రెండు పొంగులు వచ్చేదాక మరిగించాలి
 7. మూకుడులో ఎండుమిర్చి , ఆవాలు , జీలకర్ర , కరివేపాకు ,ఇంగువ ల తో పోపు వేయించాలి
 8. ఈ పోపుని రెండు పొంగులు వచ్చిన తరువాత మజ్జిగ పులుసు లో కలపాలి
 9. అంతే ఎంతో రుచికరమైన అతి ప్రాచీన మజ్జిగ పులుసు రెడీ.

నా చిట్కా:

మజ్జిగ విరగకూడదు అందుకని మజ్జిగలో సెనగపిండి కలిపి గ్రైండ్ చేసి ముక్కలతో కలిపాక స్టవ్ సిమ్ ఉంచాలి. కలుపుతూ ఉండాలి.

Reviews for Maggiga pulusu Recipe in Telugu (0)