షెజవాన్ సాస్ | Home made Schezwan sauce Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  21st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Home made Schezwan sauce recipe in Telugu,షెజవాన్ సాస్, Tejaswi Yalamanchi
షెజవాన్ సాస్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

షెజవాన్ సాస్ వంటకం

షెజవాన్ సాస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Home made Schezwan sauce Recipe in Telugu )

 • ఎండుమిరపకాయలు 50 గ్రాములు
 • తరిగిన వెల్లుల్లి 15
 • తరిగిన అల్లం 3 అంగులాల ముక్క
 • టమోటా కెచప్ 2 చెంచాలు
 • సొయా సాస్ 2 చెంచాలు
 • వైట్ వినేగార్ 2 చెంచాలు
 • నూనె 6 చెంచాలు
 • ఉప్పు తగినంత
 • నీరు సగం గ్లాస్

షెజవాన్ సాస్ | How to make Home made Schezwan sauce Recipe in Telugu

 1. ముందుగా ఎండు మిరపకాయలు తొడములు తీసి తీయగలిగిన అన్ని గింజలు తీసేయండి.
 2. వాటిని నీళ్లలో 30 నిమిషాలు ననపెట్టండి
 3. 30 నిమిషాల తరువాత ఒక మిక్సీ జార్ లో తీసుకొని 3 చెంచాలు నీరు పోసి మెత్తగా పేస్ట్ లా చేస్కోండి
 4. పోయి మీద ఒక పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించండి
 5. వేగాక ఎండుమిరపకాయలా పేస్ట్ దానిలో వేయండి.
 6. కలిపి 15 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద వేయించండి
 7. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా పేస్ట్ ని కలుపుకోండి
 8. దానిలో ఇప్పుడు సోయా సాస్ వైట్ వెనిగర్ ఉప్పు టమోటా కెచప్ వేసి కలపండి
 9. ఇంకొకసారి మూత పెట్టి 5 నిముషాలు ఉడికించుకోవాలి
 10. అంతే షెజవాన్ సాస్ తయారు.మీరు చేసుకొని ఆనందించండి.

Reviews for Home made Schezwan sauce Recipe in Telugu (0)