పెరుగు వంకాయ | Dahi bangian Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dahi bangian recipe in Telugu,పెరుగు వంకాయ, Sree Vaishnavi
పెరుగు వంకాయby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  16

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

పెరుగు వంకాయ వంటకం

పెరుగు వంకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dahi bangian Recipe in Telugu )

 • వంకాయలు: 6-8(మీడియం సైజ్)
 • పెరుగు : 1-2 కప్
 • పసుపు: 1/2 చెంచా
 • పంచదార: 1 చెంచా
 • ఉల్లిపాయ పేస్ట్: 2-3 చెంచాలు
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 చెంచాలు
 • పచ్చిమిర్చి: 4(మద్యకు కట్ చేసినవి)
 • పచ్చికొబ్బరి తురుము: 1/2 కప్
 • గసగసాలు: 2 చెంచాలు
 • కారం: 2 చెంచాలు
 • ధనియాల పొడి : 2 చెంచాలు
 • కొత్తిమీర: 1/2 కప్ (తరిగి పెట్టుకోవాలి )
 • నూనె: 2 చెంచాలు
 • ఉప్పు: రుచికి సరిపడా

పెరుగు వంకాయ | How to make Dahi bangian Recipe in Telugu

 1. ముందుగా వంకాయలను తీసుకొని వాటిని మద్యలోనికి(గుత్తివంకాయలకు) కట్ చేసుకోవాలి.
 2. తర్వాత పచ్చికొబ్బరి తురుము గసగసాలు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
 3. తర్వాత అన్ని వంకాయలను ఉప్పు నీటిలో బాగా శుభ్రం చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో వంకాయలను వేసి వేయించాలి.
 4. అలాగే వంకాయలతో పాటు పసుపు పంచదార ఉప్పు చేర్చి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
 5. ఇప్పుడు అదే పాన్ లో మరికొంత నూనె వేసి అందులో ఉల్లిపాయ పేస్ట్ ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించి అందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
 6. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొబ్బరి పేస్ట్ మరియు కారం ,ధనియా పొడి ,పసుపు ,ఉప్పు చేర్చి బాగా వేయించాలి.
 7. తక్కువ మంట మీద పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి
 8. మసాలా వేగిన తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ కలియ బెట్టాలి.
 9. పెరుగు మిశ్రమంతో మసాలా మిశ్రమం బాగా కలిసిపోయేంత వరకూ కలుపుతూ ఉడికించుకోవాలి.
 10. పెరుగులో మసాలా మిశ్రమం బాగా ఉడికి చిక్కబడిన తర్వాత వేయించి పెట్టుకొన్న వంకాయలను వేసి మరో ఐదు నిముషా పాటు తక్కువ మంటలో ఉడికించి స్టౌ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి.
 11. దింపుకొన్న తర్వాత కూడా మరికొద్దిగా పెరుగు కలుపుకోవాలి.
 12. అంతే కర్డ్ బ్రింజాల్ రెడీ . కొత్తిమీర తరగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి...

Reviews for Dahi bangian Recipe in Telugu (0)