పనస పొట్టు ఆవకాయ | Jack fruit pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Jack fruit pickle recipe in Telugu,పనస పొట్టు ఆవకాయ, Sree Vaishnavi
పనస పొట్టు ఆవకాయby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  13

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పనస పొట్టు ఆవకాయ వంటకం

పనస పొట్టు ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jack fruit pickle Recipe in Telugu )

 • 1 కప్పు : పనసపొట్టు
 • 1/2 కప్పు : ఆవ పొడి
 • 1/2 కప్పు : ఉప్పు
 • 1/2 కప్పు : కారం
 • 1/2 కప్పు : నూనె
 • 1 చెంచా : మెంతి పొడి
 • చిటికెడు : పసుపు
 • చిటికెడు : ఇంగువ
 • 1 : తురిమిన మామిడికాయ

పనస పొట్టు ఆవకాయ | How to make Jack fruit pickle Recipe in Telugu

 1. ముందుగా పనసకాయ పొట్టు తీసుకొని ఉంచుకోవాలి
 2. మామిడికాయ ని బాగా కడిగి తురుముకోవాలి
 3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆవపిండి, ఉప్పు, కారం, పసుపు ,మెంతి పిండి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
 4. అందులో తురిమిన మామిడికాయ, పనస పొట్టు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
 5. అవి కలిసాక దానిని ఎండలో పొడి పొడి అయ్యేవరకు ఎండబెట్టుకోవాలి
 6. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో నూనె వేసి కాగాక అందులో ఇంగువ, ఎండుమిరపకాయ వేసి కాచుకొని చల్లార్చుకుని అందులో వేసుకొని రెండు నుంచి మూడు రోజులు ఉరనివ్వాలి అంతే
 7. రుచికరమైన పనసపొట్టు ఆవకాయ రెడీ. ఆలస్యం చెయ్యకుండా మీరు చేసుకోండి మరీ .

నా చిట్కా:

ఆవపొడి, ఉప్పు, కారం, పనసపొట్టు అన్నీ బాగా పొడిగానే కలిపి ఒక సీసాలో వేసి ఫ్రిజ్ లో నిలువ ఉంచవచ్చు .

Reviews for Jack fruit pickle Recipe in Telugu (0)