బర్ఫీ | Burfi Recipe in Telugu

ద్వారా Sukriti Siri  |  24th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Burfi by Sukriti Siri at BetterButter
బర్ఫీby Sukriti Siri
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

బర్ఫీ వంటకం

బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Burfi Recipe in Telugu )

  • 1/4 గ్లాస్ : మంచి నెయ్యి
  • 3/4 గ్లాస్ : పాలు
  • 2 1/2 గ్లాస్ : పాల పొడి
  • 1/2 గ్లాస్ : చెక్కర
  • చిటికెడు : కుంకుమ పువ్వు
  • చిటికెడు : పసుపు రంగు
  • 2 చెంచాలు : ఎండు పలుకులు

బర్ఫీ | How to make Burfi Recipe in Telugu

  1. ఒక పళ్ళానికి లేదా కిస్తీ కి నెయ్యి రాసి ఉంచుకోండి.
  2. ఎండు పలుకులను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
  3. కుంకుమ పువ్వు, పాలు మరియు పసుపు రంగు బాగా కలిపి ఒక నిమిషం వేడి చేసుకోండి.
  4. ఒక మందపాటి మూకుడులో నెయ్యి వేసి కరిగిన తర్వాత పాల పొడి ,చెక్కర కుంకుమ పువ్వు పసుపు రంగు మరియు పాల మిశ్రమం అన్ని వేసుకొని బాగా కలుపుకోండి.
  5. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ దెగ్గర పడే వరకు ఉడికించండి.
  6. ముద్దలా మారటానికి దాదాపు 8 నుండి 10 నిమిషాలు పడుతుంది.
  7. దెగ్గర పడి ముద్దలా మారిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెం లోకి తీసుకొని సమానంగా పరుచుకోండి.
  8. తరిగి పెట్టుకున్న ఎండు పలుకులు వేసి చెంచా తో వత్తు కోండి.
  9. అరగంట పాటు ఫ్రిడ్జి లో చల్లార బెట్టుకోండి.
  10. గట్టి పడిన తరువాత నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకొని తినేయండి.
  11. పదినిమిషాల్లో బర్ఫీ తయార్.

Reviews for Burfi Recipe in Telugu (0)