బూందీ లడ్డు | Boondi ladoo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Boondi ladoo recipe in Telugu,బూందీ లడ్డు, Sree Vaishnavi
బూందీ లడ్డుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

బూందీ లడ్డు వంటకం

బూందీ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Boondi ladoo Recipe in Telugu )

 • శనగపిండి - అరకిలో
 • చక్కెర - ఒక కిలో
 • జీడిపప్పు - 100 గ్రా
 • ఎండుద్రాక్ష - 30 గ్రా.
 • ఏలకులు - 10 గ్రా
 • పచ్చ కర్పూరం
 • కుంకుమ పువ్వు

బూందీ లడ్డు | How to make Boondi ladoo Recipe in Telugu

 1. శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
 2. చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి.
 3. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
 4. ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది.
 5. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
 6. నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
 7. శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి.
 8. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి.
 9. అలా పెనం నిండా పడిన తరువాత చట్రం ముద్దలో ఉంచాలి.
 10. బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
 11. శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
 12. బూందీ వెయ్యడం పూర్తయ్యాక వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పండ్లు కూడా పాకంలో వెయ్యాలి.
 13. తరువాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలపాలి.
 14. చల్లారిన తర్వాత కావలసినంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి.

నా చిట్కా:

ఉండకడుతున్నప్పుడు విడిపోతున్నట్లు తోసిన, అరచేత్తో నొక్కినట్లయితే విడిపోవు. ఉండల్ని గాలి తగిలేటట్లుగా పదినిమిషాలు ఉంచాలి

Reviews for Boondi ladoo Recipe in Telugu (0)