ఆవకాయ | Avakaya Recipe in Telugu

ద్వారా Vijaya Chinta  |  26th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Avakaya recipe in Telugu,ఆవకాయ, Vijaya Chinta
ఆవకాయby Vijaya Chinta
 • తయారీకి సమయం

  27

  నిమిషాలు
 • వండటానికి సమయం

  12

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

ఆవకాయ వంటకం

ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Avakaya Recipe in Telugu )

 • 2 ½ kg మామిడికాయ ముక్కలు
 • 500 గ్రాములు కారం
 • ¼ కప్ ఉప్పు
 • 2 చెంచాల  పసుపు
 • 200 గ్రాములు ఆవాలు
 • 50 గ్రాములు మెంతులు
 • 300 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు
 • 1 లీటరు పప్పు నూనె /పల్లీ నూనె

ఆవకాయ | How to make Avakaya Recipe in Telugu

 1. మామిడికాయలను శుభ్రంగా కడిగి పొడి బట్టతో కొంచెం కూడా తడి లేకుండా తుడవాలి.
 2. మామిడికాయల్ని ఒక మాదిరి ముక్కలుగా కోసి, అందులో టెంకలను తీసేసి, ఆ టెంకల కింద ఉన్న సన్నని కాగితం లాంటి పొరని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
 3. వెల్లుల్లిపాయల నుండి రెబ్బల్ని వేరు చేసి వేళ్ళతో రుద్దుతూ అన్నింటికీ అంటేలా నూనె రాయాలి.
 4. వాటిని ఒక గంటపాటు ఎండలో పెట్టి మళ్ళీ వేళ్ళతో గట్టిగా రుద్దితే పొట్టు ఊడి వచ్చేస్తుంది.
 5. ఆ వెల్లుల్లి గబ్బాలలో ఓకే 50 గ్రాములు పక్కన ఉంచి, మిగతా వాటన్నింటిని మిక్సీలో వేసి ముద్దలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
 6. ఆవాలలో మట్టి బెడ్డలు ఉన్నాయేమో చూసుకొని ఏరుకోవాలి.
 7. తర్వాత ఆవాల్ని సన్నని సెగ మీద చిటపటలాడడం మొదలయ్యేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
 8. మెంతుల్ని కూడా చక్కటి వాసన వచ్చేవరకు వేయించి చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి.
 9. ఆవాల్ని, మెంతుల్ని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
 10. మామిడికాయలను ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి.
 11. పసుపు, కారం, మెంతుల పొడి, ఆవాల పొడి, వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
 12. తర్వాత సగం నూనె పోసి మళ్ళీ కలిపి, మూత పెట్టి రెండు రోజుల పాటు ఊరనివ్వాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
 13. రెండు రోజుల తర్వాత మిగతా సగం నూనె పోసి, మళ్ళీ ఒకసారి కలిపి
 14. జాడీలోకి మార్చుకోవాలి.

Reviews for Avakaya Recipe in Telugu (0)