BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మామిడి కుల్ఫీ

Photo of Mango kulfi by Pranali Deshmukh at BetterButter
316
0
0(0)
0

మామిడి కుల్ఫీ

Jun-26-2018
Pranali Deshmukh
30 నిమిషాలు
వండినది?
240 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి కుల్ఫీ రెసిపీ గురించి

నోరూరించే మామిడి కుల్ఫీ అందరికి ఎంతో ఇష్టమైనది నాతో సహా .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • భారతీయ
  • గడ్డకట్టేంత చల్లగా
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు- 2 కప్పులు
  2. పంచదార- ¼ కప్పు
  3. కార్న్ ఫ్లోర్- 1 స్పూను
  4. మామిడి పండు- 1
  5. యాలకుల పొడి- కొద్దిగా
  6. కుల్ఫీ కప్పులు- కావలసినన్ని

సూచనలు

  1. ముందుగా ¾ కప్పు పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అవి చిక్కగా మరిగిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోవాలి.
  2. తొక్క తీసిన మామిడి పండుని ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి.
  3. ఇప్పుడు మిగిలిన పాలను, పంచదారను కలిపి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి.
  4. అవి బాగా మరిగి సగం అయ్యే సరికి కార్న్ ఫ్లోర్‌ని అందులో కలపాలి. ఇంకాసేపు మరిగించాలి
  5. తర్వాత ముందుగా మరిగించి పెట్టుకున్న చిక్కటి పాలను కూడా ఆ గిన్నెలో వేసి సన్నటి మంటపై ఉంచాలి. అడుగున అంటుకోకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి.
  6. 5ని.లు ఆగాక యాలకుల పొడి వేసి దింపేయ్యాలి. చల్లారిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని ముందుగా పక్కన పెట్టిన మామిడి గుజ్జుని కలిపి మిక్సీలో వెయ్యాలి.
  7. ఇప్పుడు కుల్ఫీ కప్పులు తీసుకుని అందులో ఒక పుల్లని ఉంచి ఈ పాల మామిడి మిశ్రమాన్ని అందులో వేసి మూత పెట్టి డీ ఫ్రిజ్‌లో పెట్టాలి. 8గంటల తర్వాత తీసి తింటే ఖచ్చితంగా వారెవ్వా అనాల్సిందే..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర