పెసరపప్పు పాయసం | Green gram kheer Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  26th Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Green gram kheer recipe in Telugu,పెసరపప్పు పాయసం, Indira Bhaskar
పెసరపప్పు పాయసంby Indira Bhaskar
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

2

1

పెసరపప్పు పాయసం వంటకం

పెసరపప్పు పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green gram kheer Recipe in Telugu )

 • వేయించిన పెసరపప్పు 250గ్రా
 • బెల్లం 200గ్రా
 • పాలు 250మిల్లీ
 • ఏలకులు 4
 • జీడిపప్పు 15 గింజలు
 • కిస్మిస్ 20
 • నెయ్యి 2 చెంచాలు
 • కొబ్బరి ముక్కలు 15
 • తినే పచ్చ కర్పూరం పొడి చిటికెడు

పెసరపప్పు పాయసం | How to make Green gram kheer Recipe in Telugu

 1. ముందుగా పెసరపప్పును ఉడికించాలి.
 2. మరో గిన్నెలో బెల్లం తురుము నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి.
 3. పాలు చిక్కగా అయ్యేవరకు కాచాలి.
 4. బెల్లం పాకం లో చిక్కని పాలను కలుపుకోవాలి.
 5. ఉడికించిన పెసరపప్పు లో బెల్లం పాకం పాలు మిశ్రమాన్ని కలుపుకోవాలి
 6. పచ్చ కర్పూరాన్ని కూడా వేసి బాగా కలపాలి.
 7. మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలను వేయించుకోవాలి.
 8. చివరగా యాలకుల పొడి నెయ్యిలో వేయించుకున్న కొబ్బరిముక్కలను, జీడిపప్పులను పెసరపప్పు , బెల్లం పాకం లో కలుపుకోవాలి.

నా చిట్కా:

మరింత సులువుగా చేసుకొనుటకు కొబ్బరి పాల పౌడర్ ను కండెన్స్డ్ పాలను విడుకోవచ్ఛును.

Reviews for Green gram kheer Recipe in Telugu (1)

Ram Ram10 months ago

జవాబు వ్రాయండి