మట్టు బచ్చలి, తోటకూర కాడలతో పులుసు | Indian Spinach and Amaranthus Stems Soup Recipe in Telugu

ద్వారా Suma Malini  |  27th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Indian Spinach and Amaranthus Stems Soup recipe in Telugu,మట్టు బచ్చలి, తోటకూర కాడలతో పులుసు, Suma Malini
మట్టు బచ్చలి, తోటకూర కాడలతో పులుసుby Suma Malini
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

మట్టు బచ్చలి, తోటకూర కాడలతో పులుసు వంటకం

మట్టు బచ్చలి, తోటకూర కాడలతో పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Indian Spinach and Amaranthus Stems Soup Recipe in Telugu )

 • బచ్చలి కాడలు
 • తోటకూర కాడలు
 • ఆవాలు, మెంతులు పొడి చిటికెడు
 • ఇంగువ చిటికెడు
 • పసుపు చిటికెడు
 • బియ్యం పిండి ఒక స్పూన్
 • చింతపండు లేదా చింతకాయలు గుజ్జు 4 స్పూన్స్
 • కారం లేదా పండు మిర్చి పేస్ట్ 1 స్పూన్
 • నువ్వుల నూనె 1 స్పూన్
 • ఆవాలు, జీలకర్ర 1 స్పూన్
 • ఉప్పు రుచికి తగినంత

మట్టు బచ్చలి, తోటకూర కాడలతో పులుసు | How to make Indian Spinach and Amaranthus Stems Soup Recipe in Telugu

 1. బచ్చలి, తోటకూర కాడలను 2 అంగుళాల పొడవు గా తరుగు కోవాలి. ముదరగాఉంటే పైన పీచు చెక్కేయాలి.
 2. చింతపండు పులుసు, ఆవాలు మెంతులు పొడి, పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో 3 కూతలు వరకు ఉడికించాలి.
 3. మూకుడులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపట లాడాక కారం లేదా పండు మిర్చి పేస్ట్ వేసి వేయించాలి. ఉడికించిన బచ్చలి కాడలుకు ఈ పోపు కలపాలి.
 4. చివరిగా బియ్యం పిండి నీటిలో కలిపి ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పులుసు కు కలిపి దగ్గరగా ఉడికిన తర్వాత దింపేయాలి.
 5. ఈ వంటకం లో చెఃచిడు పచ్చి ఆవాలు నూరి కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
 6. ఈ వంటకాన్ని బాగా చల్లారిన తరువాత లేదా మరునాడు తింటే చాలా బాగుంటుంది.

నా చిట్కా:

ఈ పులుసుకు ముద్ద పప్పు లేదా నువ్వుల పొడి మంచి తోడు.

Reviews for Indian Spinach and Amaranthus Stems Soup Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo