టమోటా చారు | Tamota charu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  27th Jun 2018  |  
1 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tamota charu by Tejaswi Yalamanchi at BetterButter
టమోటా చారుby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

1

టమోటా చారు వంటకం

టమోటా చారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamota charu Recipe in Telugu )

 • టమోటాలు 7 పండువి
 • కందిపప్పు 50 గ్రాములు
 • ఉల్లిపాయ 1
 • పచ్చిమిర్చి 2
 • కార్వేపకు 2 రెమ్మలు
 • కొత్తిమీర 3 చెంచాలు తరిగినది
 • ఉప్పు తగినంత
 • పసుపు 1/4 చెంచా
 • కారం 2 చెంచాలు
 • వెల్లుల్లి రెమ్మలు 9
 • అల్లం 2 ఇంచుల ముక్క,ముక్కలుగా చేస్కోండి
 • ధనియాలు 2 చెంచాలు
 • జీలకర్ర 2 చెంచాలు మసాలా కి ,1 చెంచా తాలింపు కి
 • ఆవాలు 1 చెంచా
 • నునె 5 చెంచాలు
 • ఎండుమిరపకాయలు 3

టమోటా చారు | How to make Tamota charu Recipe in Telugu

 1. ముందుగా టమోటాలను శుభ్రంగా కడగండి
 2. ఒక గిన్నెలో తీసుకొని వాటి నిండుగా నీరు పోయండి
 3. పోయ్యి మీద పెట్టి మెత్తగా అయ్యేంతవరకు మగ్గానివ్వాలి
 4. ఆ తరువాత టమోటాలను ఒక ప్లేట్లోకి తీసుకొని పైన తొక్క తీసేయండి
 5. టమోటాలు ఉడికించిన నీరు పారబోయకండి అవి మనకి తర్వాత ఉపయోగపడతాయి
 6. కందిపప్పును తీసుకోండి చక్కగా కడగండి
 7. ఇప్పుడు కందిపప్పును ఒక కుక్కర్ లో తీసుకొని దాంట్లో ఒక గ్లాసు నీరు పోసి పొయ్యి మీద పెట్టి నాలుగు విజిల్స్ వరకు మెత్తగా ఉడికించండి
 8. నాలుగు విజిల్స్ తర్వాత చల్లారనిచ్చి మూతతీసి పప్పుగుత్తితో మెదపండి
 9. ఆ తర్వాత దానిలో ఒక గ్లాసు నీరు పోయండి
 10. దాంట్లో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని తరిగి ముక్కలుగా చేసుకుని దాంట్లో వేసుకోండి
 11. ఒక 10 నిమిషాలు పొయ్యిమీద మగ్గనిచి.తరువాత తీసి పక్కన పేటండి.
 12. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లంవెల్లుల్లి ముక్కలు వేసుకోండి
 13. దానిలో ధనియాలు వేయండి
 14. జీలకర్ర వేయండి
 15. తొక్క తీసిన టమోటాలు వేయండి
 16. వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి
 17. ఇప్పుడు టమాటాలు ఉడికించిన నీటిని ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో మనం పేస్ట్లా చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోండి
 18. పప్పు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకోండి
 19. ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి
 20. ఉప్పు,పసుపు,కారం వేసుకొని కలిపి చక్కగా పొంగు వచ్చేటట్టు వుడకనివ్వాలి
 21. ఇప్పుడు విడిగా తాలింపు పెట్టుకుందాము
 22. తాలింపు కోసం ముందుగా పోయి మీద గిన్నె పెట్టి దాంట్లో నూనె వేసి కగానివాలి
 23. కాగాక దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలని మధ్యకి తుంచి వేసుకోండి వేగానీవండి.
 24. కొత్తిమీర వేసుకోండి.కలుపుకోండి.
 25. ఈ తాలింపుని మరిగే టమోటా చారులో వేయండి
 26. మొత్తం కలిపి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి పోయి కట్టేయండి
 27. అంతే ఎంతో రుచికరమైన టమోటా చారు తయారు మీరు చేసుకొని ఆనందించండి

నా చిట్కా:

కాస్త పులుపుగా తినాలి అనుకునే వారు ఒక చెంచా చింతపండు పేస్ట్ చారులో వేసుకొని కలిపి మరిగించుకోవొచ్చు

Reviews for Tamota charu Recipe in Telugu (1)

Lakshmi Leelavathi2 years ago

జవాబు వ్రాయండి